Shruthi Haasan: ఆ డ్యాన్స్ చాలా కష్టం.. ఆరోజులు గుర్తొస్తేనే వణికిపోతాను.. శృతి హాసన్ వైరల్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్( Shruthi Haasan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కమలహాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Shruti Haasan Comments Dance Snow Falls Without Coats-TeluguStop.com

ప్రస్తుతం శృతిహాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో రెండు సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

Telugu Chiranjeevi, Dance Snow, Shruthi Haasan, Shruti Haasan, Shrutihasan, Toll

ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇకపోతే ఈమె ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా తో( Santhanu Hazarika ) కలిసి ముంబైలోనే ఒక అపార్ట్మెంట్లో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.గత కొంతకాలంగా ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు.

శృతిహాసన్ తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Telugu Chiranjeevi, Dance Snow, Shruthi Haasan, Shruti Haasan, Shrutihasan, Toll

ఇది ఇలా ఉంటే తాజాగా శృతిహాసన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ.మంచులో డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టం.

హీరోలు మాత్రం చలిని తట్టుకునేలా జాకెట్స్ వేసుకుంటారు.కానీ మాకు అలాంటివేమీ ఇవ్వరు.

కనీసం కోట్, శాలువా కూడా ఇవ్వరు.మేము కేవలం శారీ, జాకెట్ ధరించి ఆ గడ్డ కట్టిన మంచులో డ్యాన్స్ చేయాలి.

దయచేసి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని కోరుకుంటున్నాను.ఎందుకంటే నాకు ఇటీవలే ఇలాంటి అనుభవం ఎదురయ్యింది అని చెప్పుకొచ్చింది శృతిహాసన్.

కాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) చిత్రంలో ఓ సాంగ్‌ను పూర్తిగా మంచుకొండల్లో చిత్రీకరించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube