వైరల్: ప్రేమ ఒక మత్తు, మహత్తు అనడానికి ఇదే ఉదాహరణ... ఈ యువకుడి మాటలు వినండి!

ఇపుడు యూత్ అంతా ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాపురం చేస్తోంది.దానికి తగ్గట్టు ఇక్కడ క్షణానికొక కంటెంట్ అప్లోడ్ అవుతూ జనాలను ఊరిస్తూ ఉంటుంది.

 Viral: Love Is An Intoxicant , This Is An Example Of Mahattu Listen To This Youn-TeluguStop.com

దాంతో ఫన్నీగా అనిపించే కంటెంట్ ఏదన్న ఉంటే క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది.ఈ క్రమంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక యువతీయువకుల ప్రేమలు గురించి చెప్పేదేముంది.మనలో చాలా మంది ప్రేమలో పడగానే ఈ ప్రపంచాన్నే మర్చిపోయి ప్రవర్తిస్తూ వుంటారు.

ఈ క్రమంలో ఇరుగుపొరుగువారు కూడా కనిపించరు.

ప్రేమలో పడితే ముఖ్యంగా అబ్బాయిలకు తమ స్నేహితులతో గడిపే సమయం కూడా దొరకడం కష్టం.

ఎందుకంటే ఆ సమయం తమ ప్రియురాళ్లకు ఇస్తూ వుంటారు కనుక.అదే కష్టాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న ఓ ప్రేమికుడి ( lover )ముఖంలో ప్రస్ఫుటమౌతుంది.

అందులో అతను తన స్నేహితులతో సంతోషంగా గడపాలని టూర్ కి వెళ్తాడు.అదే సమయంలో అతని లవర్ కాల్ చేసి ససేమిరా మాట్లాడి తీరాల్సిందే అని కోరుతుంది.

స్నేహితులతో సెల్ఫీ ( Selfie with friends )తీసుకుని వస్తానని పర్మిషన్ అడిగినా కూడా.అతని ప్రేయసి అందుకు ఒప్పుకోదు.

ఈ క్రమంలో అతను తన లవర్‌తో ‘నా స్నేహితులతో ఇప్పటి వరకు కలిసి ఒక్క సెల్ఫీ ( Selfie )కూడా దిగలేదు.మనం మాట్లాడింది చాలు.మళ్ళీ కాల్ చేస్తాను.ఒకే ఒక్క సెల్ఫీ తీసుకుని వస్తాను’ అని అడుగుతాడు.అయినా కూడా ఆమె అందుకు అంగీకరించదు.దీంతో అతను ‘సరే మాట్లాడు’ అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు.

కాగా దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు అతని పరిస్థితిపై మిక్కిలి విచారం వ్యక్తం చేస్తున్నారు.ప్రేమలో పడితే ఇంతే బ్రో… మన మగాళ్ల బాధలు ఎవరికీ అర్ధం కావు అని కొందరు కామెంట్ చేస్తే, ఆ అమ్మాయి ఇలా ప్రవర్తించడం తప్పు అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube