అక్కడా ఇక్కడా  : కిరణ్  ' రాజకీయం ' ఎక్కడో  ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Nallari Kiran Kumar Reddy ) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు.చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి బాల్యం నుంచి హైదరాబాదులోనే ఉన్నారు.

 Here And There Kiran 'politics' Somewhere, Kiran Kumar Reddy, Bjp, Congress, Jai-TeluguStop.com

  గతంలో పీలేరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు,  వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ స్పీకర్ గాను కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు.ఇక హైదరాబాద్ తో పాటు, ఏపీలోనూ ఆయనకు విస్తృతంగా రాజకీయ పరిచయాలు ఉండడం,  రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి కిరణ్ కుమార్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకుంది.

అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సేవలను ఏపీ లో వినియోగించుకుంటారా లేక తెలంగాణలో వినియోగించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

Telugu Bjp Ap, Congress, Janasena, Nallarikishore-Politics

ఈ విషయంలో బిజెపి అగ్ర నాయకులు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డిని రెండు రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకుంటామని చెబుతున్నారు.త్వరలోనే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా రెడ్డి సామాజిక వర్గం దృష్టిని ఆకర్షించాలనే ప్లాన్ తో బిజెపి ఉంది.

కానీ ఆంధ్ర –  తెలంగాణ విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ,  జై సమైక్యాంధ్ర ( Jai Samaikyandhra )పేరుతో కొత్త పార్టీని పెట్టారు.కానీ ఆ పార్టీ ప్రభావం 2014 ఎన్నికల్లో కనిపించకపోవడంతో,  తిరిగి ఆయన 2018లో కాంగ్రెస్ లో చేరిపోయారు.

తెలంగాణ విభజనను వ్యతిరేకించిన కిరణ్ కుమార్  రెడ్డిని బిజెపిలో చేర్చుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్( MLA Balka Suman ) విమర్శించారు.

Telugu Bjp Ap, Congress, Janasena, Nallarikishore-Politics

ఏపీలో కిరణ్ క్రియాశీలక పాత్ర పోషించాలి అనుకున్నా.అక్కడ బిజెపి పరిస్థితి అంతంత మాత్రమే  అన్నట్టు గా ఉంది.   ఎన్నికల నాటికి అక్కడ ఏ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.అదీ కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో యాక్టివ్ గా ఉన్నారు.2019 ఎన్నికల్లో పీలేరు నుంచి ఆయన పోటీ చేసి ఓటమి చెందారు .ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు కిషోర్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు.ఈ పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేస్తారా లేక తెలంగాణ నుంచి చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు కిరణ్ సేవలను బిజెపి ఏపీలోనా లేక తెలంగాణకు పరిమితం చేస్తారా అనేది ఎవరికి  అర్థం కావడంలేదు.మరికొన్ని రోజుల్లోనే కిరణ్ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లారిటీ రాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube