హైదరాబాద్ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మోదీ కామెంట్స్ కు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది.
ప్రధాని మోదీకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు.తెలంగాణలో అభివృద్ధి జరగకపోయి ఉంటే కేంద్రం ఎందుకు అవార్డులు ఇస్తోందని ప్రశ్నించారు.
వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారన్న మంత్రి తలసాని అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు ఏంటని మండిపడ్డారు.తెలంగాణపై ప్రధాని మోదీ తప్పుడు విమర్శలు చేశారని చెప్పారు.దేశంలో 24 గంటల కరెంట్ కేవలం తెలంగాణ మాత్రమే అందిస్తుందన్నారు.24 గంటల కరెంట్, సాగు, తాగునీటిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.