పవన్ ఢిల్లీ టూర్ అందుకేనా ? ఆ ఇద్దరితో భేటీ వెనుక ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకస్మికగా ఢిల్లీకి వెళ్లారు.ఆయన పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ , ఆయన బిజెపి అగ్ర నేతలైన అమిత్ షా తో పాటు, జేపీ నడ్డా( Amit Shah )ను కలవబోతున్నారు.

 Is This Why Pawan's Delhi Tour? Behind The Meeting With Those Two , Pavan, Pava-TeluguStop.com

పవన్ ఇంత అకస్మాత్తుగా,  ఢిల్లీ టూర్ పెట్టుకోవడం వెనుక కారణాలు ఏమిటనేది ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది .ఇటీవల వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు.ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా , ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వంటి వారితో భేటీ అయ్యి, ఏపీకి సంబంధించిన అనేక రాజకీయ అంశాలతో పాటు, పెండింగ్ నిధులు ,పోలవరం ప్రాజెక్ట్ తదితర అంశాలపై చర్చించారు.

పవన్ ఢిల్లీ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత,  పవన్ ఢిల్లీ టూర్( Pawan Kalyan ) కి వెళ్లడం పై అపాయింట్మెంట్లు ఖరారు అయ్యాయి.పవన్ ఢిల్లీ టూర్ లో ఈ ఇద్దరు నేతలను కలవబోతున్నారు.పవన్ ఢిల్లీ టూర్ లో ఏపీ రాజకీయ అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తోంది.

పవన్ వెంట ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) కూడా పాల్గొన్నారు.ప్రస్తుతం ఏపీలో బిజెపి , జనసేన పార్టీల మధ్య పొత్తు వ్యవహారం పై సరైన క్లారిటీ లేదు.

రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నా, ఎవరికి వారు విడివిడిగానే కార్యక్రమాలు చేస్తున్నారు.  అంతే కాకుండా జనసేన, టిడిపి తో పొత్తు పెట్టుకునే ప్రయత్నాల్లో ఉండడం, మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

 పవన్ ఢిల్లీ టూర్ లో ఏపీలో పొత్తు అంశంపై ప్రధానంగా చర్చ జరగబోతున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.బిజెపితో తెగ తెంపులు చేసుకునే విధంగా ఇటీవల కాలంలో పవన్ వ్యవహరిస్తుండడం,  అదే సమయంలో టిడిపికి దగ్గరవుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతుండడంతో  బిజేపి అగ్ర నేతలు పవన్ కు రూట్ మ్యాప్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube