Santanu Hazarika: హీరో నానికి గిఫ్ట్ ఇచ్చిన శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్.. ఏం ఇచ్చాడంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్( Shruti Hasan ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం శృతిహాసన్ అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

 Heroine Shruti Haasan Rumored Lover Santanu Gift To Hero Nani-TeluguStop.com

ఇకపోతే ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.ఆమె గత కొంతకాలంగా ప్రియుడు శాంతను హజారికాతో( Shantanu Hazarika ) సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.

వీరిద్దరూ గత కొంతకాలంగా ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు.కాగా హజారిక డూడుల్ ఆర్టిస్ట్ అన్న సంగతి తెలిసిందే.

ఆయన తనదైన శైలిలో కళాఖండాలు రూపొందిస్తుంటారు.అనూహ్యంగా శాంతను హజారిక హీరో నానికి( Nani ) ఊహించని సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు.దసరా చిత్రంలోని నాని ఐకానిక్ స్టిల్ డూడుల్ ఆర్ట్ లో రూపొందించారు.దసరా చిత్ర డూడుల్ ఆర్ట్ పోస్టర్ అదిరిపోగా నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు.శాంతను హీరో నాని మీద అభిమానం చాటుకోవడం విశేషంగా మారింది.ఇకపోతే నాని విషయానికొస్తే.

గత ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరో నాని తాజాగా దసరా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.మొదటి సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.వీరిద్దరూ కూడా మాస్ లుక్ లో కనిపించారు.సినిమాలో ఇద్దరి నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube