ఇటీవలే కాలంలో దారుణాలు, మోసాలు, దొంగతనాలు క్రమేణ పెరుగుతూ పోతున్నాయి.అయితే దొంగతనాల విషయానికి వస్తే విచ్చలవిడిగా సెల్ ఫోన్ దొంగలించే వారి సంఖ్య అధికంగా ఉంది.
రోజురోజుకు సెల్ ఫోన్ దొంగతనాలు పెరుగుతూ పోతూ ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన మొబైల్ ఫోన్ దొరుకుతుంది అనే గ్యారంటీ లేదు.అయితే తెలంగాణ ప్రభుత్వం( Telangana ) ఈ సెల్ ఫోన్ దొంగతనాలపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో సెల్ ఫోన్లు దొంగలించే వారికి కాలం చెల్లినట్టే.ఇందుకోసం సీఐడీ రంగంలోకి దిగి, కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ( CIER ) తో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమవుతోంది.
ఈ ఒప్పందం కుదిరితే సెల్ ఫోన్ దొంగతనాల కేసులు క్షణాల్లో పరిష్కరించబడతాయి.

ఈ ఒప్పందంతో సీఈఐఆర్ సాయంతో దొంగలించబడిన సెల్ ఫోన్ ట్రాక్( Cell phone track ) చేయబడుతుంది.దొంగలించిన ఫోన్ వినియోగించిన, సిమ్ కార్డ్ మార్చే ప్రయత్నం చేసిన, ఆ సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా ఏ ప్రాంతంలో ఉందో తెలుస్తుంది.భారతదేశంలో ఈ టెక్నాలజీ ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగర పోలీసులు వినియోగిస్తున్నారు.

ఈ టెక్నాలజీ వల్ల దొంగలను గుర్తించడం చాలా సులువుగా మారింది.కాబట్టి తెలంగాణలో ఈ టెక్నాలజీ వినియోగం లోకి వస్తే హైదరాబాద్( Hyderabad ) నగరంలో సెల్ ఫోన్ దొంగతనాలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక మొబైల్ ఫోన్ దొంగలించబడిన, పోగొట్టుకుపోయిన కచ్చితంగా దొరుకుతుంది.రోజురోజు హైదరాబాదు నగరంలో పెరుగుతున్న మొబైల్ ఫోన్ దొంగతనాలను అరికట్టడం కోసం తెలంగాణ పోలీసులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అమలులోకి వస్తే దొంగతనాలు చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి.ఈ టెక్నాలజీ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.