మీరు సంగీత ప్రియులా? అయితే మీ కోసం యాపిల్ ఓ శుభవార్త తీసుకొచ్చింది!

అవును, మీరు విన్నది నిజమే.యాపిల్ శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “యాపిల్ మ్యూజిక్ క్లాసిక్” అనే పేరుతో ఓ కొత్త యాప్‌ను ఈ మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించనుందని తెలుస్తోంది.

 Are You A Music Lover But Apple Has Brought A Good News For You, Apple , Lovers,-TeluguStop.com

అయితే ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌లో సంగీతాన్ని ఆస్వాదించడానికి వినియోగదారులు ప్రత్యేక సభ్యత్వాన్ని కొనుగోలు చేయవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆపిల్ తెలిపింది.యాప్ స్టోర్ జాబితా ప్రకారం, ఆపిల్ మ్యూజిక్ క్లాసికల్ యాప్ ఐఫోన్ 6 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వాటితో పని చేస్తుంది.

అదే విధంగా ఇది ఇంగ్లీష్ తో పాటుగా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్ మరియు స్పానిష్‌తో సహా 6 భాషలకు అనుమతి ఇస్తుంది.

Telugu Apple, Applemusic, Latest, Lovers, Ups-Latest News - Telugu

ఆపిల్ మ్యూజిక్ యాప్ లో 100 మిలియన్లకు పైగా పాటలు వున్న సంగతి అందరికీ ఉన్నాయి.కాగా ఈ క్లాసిక్ యాప్ ఆపిల్ మ్యూజిక్ వాయిస్ ప్లాన్ తో పని చేయదని తెలుస్తోంది.అదే విధంగా ఈ యాప్ చైనా, జపాన్, కొరియా, రష్యా, తైవాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్‌లోని వినియోగదారులు ఈ ఆపిల్ మ్యూజిక్ క్లాసికల్ ని యాక్సెస్ చేయలేరు.2021లో కంపెనీ ప్రైమ్‌ఫోనిక్‌ని కొనుగోలు చేసిన తర్వాత ఈ యాప్‌ను ప్రారంభించడం జరిగింది.ప్రీమియం క్లాసికల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను అందించడంలో ఇది ప్రసిద్ధి చెందింది.

Telugu Apple, Applemusic, Latest, Lovers, Ups-Latest News - Telugu

మొదట ఐఫోన్ యూజర్లకే ఇది అందుబాటులో ఉండగా, నేడు అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.యాపిల్ ఐఫోన్ 6, ఆ తర్వాత వెర్షన్ ఫోన్లపై ఈ మ్యూజిక్ క్లాసిక్ యాప్ పని చేయనుంది.ఇది ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, డచ్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుంది.ఐవోఎస్ వెర్షన్ 15.4 ఆ తర్వాత వెర్షన్ వాడే వారికే ఈ యాప్ పని చేయనుంది.ఇకపోతే ఈ క్లాసికల్ మ్యూజిక్ యాప్ లో 50 లక్షల ట్రాక్స్ అందుబాటులో ఉంచినట్టు యాపిల్ సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube