రెండు దశాబ్దాల క్రితం తమిళ సినిమాల ద్వారా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ త్రిష.దాదాపు 21 ఏళ్ళ క్రితం అంటే 2002 లో మౌనం పెసియాదే చిత్రంలో సూర్య సరసన హీరోయిన్ గా నటించింది.
అప్పటి నుంచి నేటి వరకు ఆమె హీరోయిన్ గా నటిస్తూనే ఉండటం విశేషం.ప్రతి సారి తన పని అయిపొయింది అనుకున్న టైం లో మళ్లి ఎగిసిపడిన అలలా ఉవ్వెత్తున వచ్చి పడేది.20 ఏళ్ళ పాటు ఒక హీరోయిన్ కి కెరీర్ ఉండటం అనేది ఈ రోజుల్లో దాదాపు అసాధ్యమే.కానీ త్రిష కు మాత్రమే అది సాధ్యం అవ్వడం వెనక ఆమె కృషి మరియు పట్టుదల ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి.

ముసలి హీరోయిన్ అని అంత కామెంట్స్ చేస్తూ ఆమె పని అయిపోయింది అనుకున్న టైం లో 96 సినిమా త్రిష కు మళ్లి ఊపిరి పోసింది.ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించడం తో ఆమెకు మంచి మార్కులు పడ్డాయి.వయసేమో 40 కానీ పాతిక ఏళ్ళ హీరోయిన్ లాగ కనిపిస్తూ ఉంటుంది.ఇప్పటికి ఆమె చేతిలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నాయ్.హీరో విజయ్ సరసన లియో చిత్రం లో నటిస్తుండగా, ఈ సినిమా 400 కోట్ల బిజినెస్ చేసింది.సౌత్ ఇండియాలోనే ఈ రేంజ్ చేసిన సినిమా మరొకటి లేదు.
ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కానగరాజ్ కాగా సంజయ్ దత్, అర్జున్ లాంటి దిగ్గజ హీరోలు కనిపిస్తున్నారు.

విక్రమ్ సినిమా తర్వాత లోకేష్ పేరు ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది.అలాంటి టైం లో విజయ్ తో లోకేష్ ప్రాజెక్టు ప్రకటించగానే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది.ఇక త్రిష విషయానికి వస్తే ఈ సినిమా తో పాటు పొన్నియన్ సెల్వన్ సినిమా సీక్వెల్ లో కూడా త్రిష కనిపించనుండగా, మోహన్ లాల్ సినిమా రామ్ పార్ట్ 1 లో కూడా త్రిష నటిస్తుంది.
ఇక తానే మెయిన్ లీడ్ గా వస్తున్న మరొక సినిమా ద రోడ్, ఆ తర్వాత సాధురంగా వెట్టై చిత్రంలో కూడా త్రిష నటిస్తుంది.ఇలా ఏజ్ మీద పడుతున్న తరుణం లో ఎంతో ప్రెస్టీజియస్ సినిమాల్లో కనిపించడం ద్వారా త్రిష పని ఇంకా అయిపోలేదు అనే సంకేతాలు ఇస్తుంది.
అయినా హీరోలకు దీటుగా హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడం అనేది ఎవరైనా సరే త్రిషను చూసే నేర్చుకోవాలి.