ఆ కమెడియన్ చివరి కోరిక తీరుస్తానన్న రజిని... ఆ కోరిక ఏంటంటే?

ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.

 Rajinikanth To Fulfill Actor Mayil Swamy Last Wish Details, Rajinikanth , Actor-TeluguStop.com

తెలుగు ఇండస్ట్రీలో యువ హీరో తారకరత్న మరణించడం తీరని లోటు అయితే అదే రోజున తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు మయిల్ స్వామి మరణించడంతో తమిళనాడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Telugu Mayil Swamy, Kollywood, Rajinikanth, Rajini Kanth, Tiruvannamalai-Movie

మయిల్ స్వామి ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక ఈయన సూపర్ స్టార్ రజనీకాంత్ కు చిరకాల స్నేహితుడు కావడం విశేషం.ఈ క్రమంలోనే నటుడు మయిల్ స్వామి మరణించారని వార్త తెలియగానే రజినీకాంత్ ఆయన ఆఖరి చూపు కోసం తరలివచ్చారు.

రజనీకాంత్ మయిల్ స్వామికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన గొప్పతనం గురించి తెలియజేశారు.తను నటుడు మాత్రమే కాదని ఒక సామాజిక సేవకుడు అంటూ రజనీకాంత్ మయిల్ స్వామి మంచితనం గురించి తెలియజేశారు.

Telugu Mayil Swamy, Kollywood, Rajinikanth, Rajini Kanth, Tiruvannamalai-Movie

మయిల్ స్వామి ప్రతి ఏడాది తప్పనిసరిగా తిరువన్నామలై వెళ్తారని, ఇలా తిరువన్నామలై వెళ్లే ముందు తప్పనిసరిగా తనకు ఫోన్ చేసేవారని తెలిపారు.ఎప్పటికైనా తనని తనతో పాటు తిరువన్నామలై తీసుకువెళ్లాలని తన కోరిక అని తెలిపారు.అయితే తన ఆ కోరికను నేను నెరవేరుస్తానని తప్పనిసరిగా నేను తిరువన్నామలై వెళ్తానని రజనీకాంత్ తెలిపారు.ఇప్పటికే తాను తిరువన్నామలై అర్చకులతో కూడా మాట్లాడాలని ఈ సందర్భంగా రజనీకాంత్ మయిల్ స్వామి కోరిక గురించి తెలియజేశారు.

ఇక ఈయన శివ భక్తుడు కావడంతో శివ వాయిద్యాల నడుమ ఈయన అంతిమయాత్ర కొనసాగింది.ఇక ఈయన అంత్యక్రియలను స్థానిక వడపళనిలోని ఏ వీఎం స్మశాన వాటికలో జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube