ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో తప్పిపోయిన ఎన్ఆర్ఐ ఆచూకీని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు.వివరాల్లోకి వెళితే.
దక్షిణాఫ్రికాలో స్థిరపడిన ధర్మలింగం పిళ్లై (69) అనే ఎన్ఆర్ఐ.మెమొరీలాస్ సమస్యతో బాధపడుతున్నాడు.
ఈయన గత నెల 30న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కుమార్తెతో కలిసి డర్బన్ వెళ్లాల్సి వుంది.అయితే కాసేపట్లో విమానం ఎక్కుతాడనగా.
ధర్మలింగం అదృశ్యమయ్యాడు.క్లర్క్‌గా పనిచేసిన ఆయన రిటైర్ అవ్వగా.
అతని కుమార్తె లాజిస్టిక్స్ రంగంలో సీనియర్ హోదాలో వున్నారు.ధర్మలింగం పుట్టినరోజును పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులను , మిత్రులను కలిసేందుకు వీరిద్దరూ కలిసి భారతదేశానికి వచ్చారు.
ఈ నేపథ్యంలో ధర్మలింగం అదృశ్యానికి సంబంధించి జనవరి 31న సహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.తర్వాత పిళ్లై ఫోటో, ఇతర సమాచారంతో కడిన పోస్టర్లను అంటించారు.అతని కుమార్తెతో పాటు ముంబైలోని దక్షిణాఫ్రికా కాన్సులేట్ కార్యాలయం ధర్మలింగం ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి.సిటీ పోలీసులు కూడా పిళ్లైకి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు.
అలాగే ఆయనను గాలించేందుకు పలు పోలీస్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి.ఈ క్రమంలో విమానాశ్రయం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.
ఈ నేపథ్యంలో 12 రోజుల తర్వాత ముంబై సబర్బన్.ఖార్ ఏరియాలోని 14వ రోడ్డులో పిళ్లై తిరుగుతున్నట్లు గుర్తించిన ఇద్దరు వ్యక్తులు అతని వివరాలు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు.వీరు సోషల్ మీడియాతో పాటు మీడియా కథనాల ద్వారా ధర్మలింగం తప్పిపోయినట్లు గుర్తించారు.దీంతో ఒక పోలీస్ బృందం ఆ ప్రాంతానికి చేరుకుని, ధర్మలింగం కుమార్తెకు కూడా సమాచారం అందించింది.
అనంతరం ఆయనను పీఎస్‌కు తరలించి కుమార్తెతో కలిపారు.ఆ సమయంలో తండ్రీ కూతుళ్లు భావోద్వేగానికి గురయ్యారు.
సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ గోవిల్కర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు సుశాంత్ బావాచ్కర్, సునీల్ వాగ్రేలతో కూడిన బృందాలు ధర్మలింగం ఆచూకీ కోసం తీవ్రంగా గాలించాయి.ఎట్టకేలకు ఆయన జాడ తెలియడంతో వీరిని ఉన్నతాధికారులు అభినందించారు.