సింగపూర్: ఏకంగా పోలీసుల అడ్డాలోనే దొంగతనం.. అడ్డంగా బుక్కయిన ముగ్గురు భారతీయులు

పనిచేయమని పిలిస్తే.ఏకంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే కన్నం వేయాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు ముగ్గురు భారత సంతతి వ్యక్తులు.

 3 Indian-origin Electricians In Singapore Fined For Trying To Steal Cable , Tech-TeluguStop.com

దీనికి సంబంధించి సింగపూర్ న్యాయస్థానం వారికి జరిమానా విధించింది.వివరాల్లోకి వెళితే.

టెక్నీషియన్లు ఎళిలరసన్ నాగరాజన్ , రాధాకృష్ణన్ ఇళవరసన్‌లకు 1000 సింగపూర్ డాలర్లు, బాలసుబ్రమణియన్ నివాస్‌కి 1500 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.వీరు 2020లో సింగపూర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ అప్పగించిన పనిచేస్తూ ఎలక్ట్రిక్ కేబుల్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో మురుగన్ కోతలం అనే మరో ఎలక్ట్రిషియన్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.మిగిలిన ముగ్గురూ దొంగతనానికి ప్రయత్నించినట్లు కోర్ట్ ఎదుట నేరాన్ని అంగీకరించారు.

Telugu Electrician, Radhakrishnan, Singapore-Telugu NRI

దీనిపై డిప్యూటీ ప్రాసిక్యూటర్ వి జేసుదేవన్ మాట్లాడుతూ.ఆల్‌టెక్ సిస్టమ్స్‌లో పనిచేస్తున్న ఇళవరసన్, నివాస్‌లు అక్టోబర్ 15, 2020 ఉదయం 10.30 గంటల సమయంలో పోలీస్ నేషనల్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ భవనానికి చేరుకున్నారు.కేబుల్స్ కట్ చేసి విక్రయించాలని వీరు ప్లాన్ చేశారని జేసుదేవన్ తెలిపారు.

నాగరాజన్, ఎళవరసన్‌లు రీల్‌ను కట్ చేయడానికి ప్రధాన భవనం వద్దకు వెళ్లారని ఆయన చెప్పారు.ఈ క్రమంలో నిచ్చెనపై వున్న కోతలన్ విద్యుదాఘాతానికి గురయ్యాడు.ఈ విషయాన్ని గమనించిన నివాస్.నిచ్చెనను తన్నడంతో కోతలం కిందపడిపోయాడు.

Telugu Electrician, Radhakrishnan, Singapore-Telugu NRI

ఇదిలావుండగా.ఇదే రకమైన దొంగతనం కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి గత నెలలో 42 నెలల జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్ట్.జనవరి 2020లో ఖాళీగా వున్న కాలేజ్ నుంచి కాపర్ వైర్లు, కేబుల్స్ దొంగిలించినందుకు న్యాయస్థానం ఈ శిక్ష విధించింది.భారత సంతతి వ్యక్తితో పాటు ఇద్దరు విదేశీ కార్మికులు కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నారు.

నిందితుడిని ఓం శక్తి తివారీగా గుర్తించారు.ఇతను తన బంగ్లాదేశ్ మిత్రులతో కలిసి ఘటన జరిగిన రోజు రాత్రి ఖాళీగా వున్న కాలేజీలోంచి కిలోల కొద్దీ ఎలక్ట్రిక్ కేబుల్స్‌ను దొంగిలించాడు.

తొలుత 994 కిలోల కేబుల్‌ను రీ సైక్లర్స్‌కు 3,976 సింగపూర్ డాలర్లకు.తర్వాత మరో 773 కిలోల కేబుల్‌ను అదే దుకాణదారుడికి మరో 3,976 సింగపూర్ డాలర్లకు విక్రయించాడు.

ఈ సొమ్ములో కొంత మొత్తాన్ని తనకు సాయం చేసిన బంగ్లాదేశ్ మిత్రులకు ఇచ్చినట్లు ఛానెల్ న్యూస్ ఏషియా తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube