పంచాయతీ నిధుల మళ్లింపు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది.
నిధులను ఓ ఖాతా నుంచి మరో ఖాతాకు నిధులను ఎలా బదిలీ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.మూడు నెలలు గడిచినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది.