శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో అడ్డగోలుగా అంతరాలయ దర్శనాలు జరుగుతున్నాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దేవాలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూ ఉంటారు.
దర్శనం చేసుకునే భక్తులు పంచ ధరించాలని నిబంధన ఉంది.అర్చకులు ఇష్టాను రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు.
అంతరాలయంలో హారతి పళ్లేలతో చిన్న వసూలు చేయకూడదని కొన్ని నెలల క్రితం నిబంధన.కూడా విధించారు ఇద్దరు అర్చకులు దక్షిణా వాసులు చేస్తుండగా గుర్తించి సస్పెండ్ కూడా చేశారు.
కానీ వసూళ్ల తీరు మాత్రం అసలు మారలేదు.అంతరాలయ దర్శనాల కోసం సిఫారసులపై వచ్చేవారు, ప్రముఖులను అనుమతించాలి.కానీ స్వామివారి సన్నిధిలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించినట్లు మూడు రోజుల నుంచి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆదివారం మాఘ పౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.
ఎంత రద్దీగా ఉన్నా అక్కడ పనిచేసే అర్చకులు తమకు తెలిసిన వారిని అంతరాలయ దర్శనాలకు అనుమతిస్తున్నారు.
దీని వల్ల ఆ క్యూ లైన్ లు నెమ్మదిగా సాగాయి.సోమవారం కూడా ఇష్టానుసార అంతరాలయ దర్శనం చేయడంతో భక్తులు ఆసనం వ్యక్తం చేశారు.స్వామివారి సన్నిధిలో ముఖ మండపం వద్ద స్వామివారి ఏకాంత సేవ ఉత్సవ మూర్తిని కూడా ఏర్పాటు చేశారు.
గడప వద్ద ఏకాంత సేవ ఉత్సాహమూర్తి ఉండగా ఎవరు అంతరాయం లోకి వెళ్లడానికి శాస్త్ర నియమం అంగీకరించాదు.
ఇదే అదునుగా అర్చకులు తమకు అయిన వారు వచ్చిన వెంటనే ఉత్సవ మూర్తిని ఆగ మేఘాలపై అక్కడి నుంచి తీసి లోపల పెట్టి తమకు తెలిసిన వారికి అంతరాలయ దర్శనాలు చేయిస్తున్నారని భక్తులు చెబుతున్నారు.తమ వారు ఎవరూ లేనప్పుడు ఉత్సవ మూర్తిని గడప వద్ద కొలువు తిరుగుతున్నారని వెల్లడించారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అంతరాలయ దర్శనాలు గందరగోళంగా జరగడం చర్చని అంశంగా మారింది.
TELUGU BHAKTHI