ఓరి, మీ దుంపలు తెగ.. వందే భారత్ బోగీల నిండా చెత్తే!!

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం ప్రజల అదృష్టమని చెప్పొచ్చు.చాలా ఫాస్ట్‌గా ఎంతో సౌకర్యమంతమైన ప్రయాణాలను ఇవి మనకు అందిస్తాయి.

 Vande Bharat Bogies Are Full Of Dust , Vande Bharat Express Train, Littering, Ga-TeluguStop.com

అయితే ఇలాంటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలో చాలామంది ఇష్టం వచ్చినట్లు చెత్త పడేస్తూ అందరి చేత తిట్టించుకుంటున్నారు.తాజాగా ఒక వందే భారత్ కోచ్‌ను డంపింగ్ యార్డ్‌గా మార్చారు ప్రయాణికులు.

ఈ కోచ్‌ మొత్తం చెత్తతో నిండి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో ఈ ఫొటోను షేర్ చేశారు.

ఈ పిక్‌లో కోచ్ నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్న ఖాళీ సీసాలు, ఉపయోగించిన ఫుడ్ బాటిల్స్, తాగి పడేసిన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు, ఇంకా మరింత చెత్త కనిపించింది.ఈ చెత్తను శుభ్రం చేయడానికి చీపురు పట్టుకున్న ఉన్న ఒక ట్రైన్ ఉద్యోగి కూడా కనిపించాడు.

ఈ ఫొటోకు సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వచ్చాయి.చాలామంది చెత్త వేయడాన్ని ఖండిస్తున్నారు.

దేశాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను ఇతరులు తీసుకోవాలని కోరారు.దేశాన్ని ప్రజా రవాణా వాహనాలను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత భారతీయులకు లేకపోవడం దురదృష్టకరమని ఒక యూజర్ ఘాటుగా కామెంట్ చేశారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెత్త వేయడాన్ని దృష్టికి తీసుకురావడం ఇదే మొదటిసారి కాదు.ఈ నెల ప్రారంభంలో, సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో చెత్త పడి ఉండటంతో రైలులో పరిశుభ్రత పాటించాలని భారతీయ రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.రైలు విశాఖపట్నం చేరుకున్నప్పుడు, ఆన్‌బోర్డ్ హౌస్ కీపింగ్ సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రం చేసినప్పటికీ, కోచ్‌లు చాలా మురికిగా ఉన్నాయని రైల్వే పేర్కొంది.

రైల్వే అధికారులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు.‘పౌరులు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వారి బాధ్యత.ఇక నుంచైనా వైఖరి, ఆలోచనా విధానం మారాలి.

స్వచ్చ్ రైల్-స్వచ్ఛ్ భారత్ అనే నినాదం నెరవేర్చే బాధ్యత అందరికీ ఉంది.మెరుగైన సేవలందించడానికి రైల్వేకు సహకరించాలి.’ అని ఒక రైల్వే అధికారి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube