మనం సాధించే విజయం ఎంతో గొప్ప విజయం అయితే ఆ విజయాన్ని గుర్తించే వాళ్ల సంఖ్య కూడా ఊహించని స్థాయిలో ఉంటుంది.పదేళ్ల క్రితం వరకు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అయితే రాజమౌళి సినిమాల్లోకి ఏ విధంగా వచ్చారు? ఆయన సక్సెస్ కు కారణం ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు చాలామంది అభిమానులకు తెలియవు.
అయితే తాజాగా జక్కన్న స్వయంగా ఈ ప్రశ్నలకు సమాధానాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో అవార్డులు వస్తున్నాయి.ఈ అవార్డులు జక్కన్న స్థాయిని పెంచడంతో పాటు జక్కన్న ఎంత గొప్ప దర్శకుడు అనే విషయం తెలియని వాళ్లకు సైతం తెలియడానికి కారణమవుతున్నాయి.
తాజాగా ఆర్.ఆర్.ఆర్ సినిమాకు బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ పిక్చర్ కేటగిరీలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ వచ్చింది.ఈ అవార్డ్ ను అందుకున్న జక్కన్న మాట్లాడుతూ మా అమ్మ పేరు రాజనేంద్రి అని నాలోని టాలెంట్ ను గుర్తించి నేను సినిమా రంగం వైపు వచ్చేలా చేసిన వ్యక్తి ఆమేనని రాజమౌళి చెప్పుకొచ్చారు.
మా వదిన శ్రీవల్లి నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుందని జక్కన్న కామెంట్లు చేయడం గమనార్హం.
శ్రీవల్లి నాకు మరో అమ్మ అని రాజమౌళి పేర్కొన్నారు.నా భార్య రమా రాజమౌళి నా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుందని అందరికీ తెలుసని అయితే నిజ జీవితంలో కూడా నా డిజైనర్ రమ అని రాజమౌళి కామెంట్లు చేశారు.నా కూతుళ్లు నా కోసం ఏం చేయకపోయినా వాళ్ల నవ్వు నాకు చాలని రాజమౌళి తెలిపారు.
ఆ తర్వాత భారతదేశం గురించి మాట్లాడుతూ మేరా భారత్ మహాన్ జై హింద్ అంటూ రాజమౌళి చేసిన కామెంట్లపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
.