గూగుల్ మీట్‌లో ఎమోజీ రియాక్షన్స్ ఫీచర్ లాంచ్.. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే?

ఇన్-మీటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ ‘గూగుల్ మీట్ఎమోజీ రియాక్షన్లను యూజర్లకు రిలీజ్ చేయడం మొదలుపెట్టింది గూగుల్.వీడియో కాలింగ్ మీటింగ్‌ సమయంలో స్పీకర్‌కి అంతరాయం ఏర్పడకుండా యూజర్ సైలెంట్‌గా ఎమోజీలు పంపించి తమ భావాలను వ్యక్తపరచడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

 Emoji Reactions Feature Launch In Google Meet How Is It Useful ,google Meet, Goo-TeluguStop.com

అవి పంపినవారి వీడియో టైల్‌లో టాప్ లెఫ్ట్ కార్నర్‌లో చిన్న బ్యాడ్జ్‌గా కనిపిస్తాయి.తద్వారా వీడియో కాల్ లో ఉన్నవారు ఏ ఎమోజీ పంపించారనేది ఈజీగా తెలుస్తుంది.

అలానే స్క్రీన్ ఎడమ వైపున ఎవరెవరు ఏ రియాక్షన్స్ ఇచ్చారో వరుసగా ఒక లైన్ లో కనిపిస్తాయి.

నిజానికి గతేడాదిలోనే ఎమోజీ రియాక్షన్లను తీసుకొస్తామని గూగుల్ ప్రకటించింది.

కానీ దానిని 2022లో తీసుకురాలేదు.ఇప్పుడు మాత్రం తీసుకొస్తూ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన బ్లాగ్‌పోస్ట్‌లో.“ఎక్కువ మంది వ్యక్తులు ఒకే ఎమోజీని వరుసగా ఉపయోగించినప్పుడు ఎమోజీలు బరస్ట్ అవుతాయి.ఈ ఎమోజీలను నచ్చినట్లు కస్టమైజ్‌ చేసుకోవచ్చు, అంటే మీరు వివిధ స్కిన్ టోన్‌లను ఎంచుకోవచ్చు.” డిఫాల్ట్‌గా, ఎమోజీ రియాక్షన్లు ఆన్ అవుతాయి.కానీ వాటిని అడ్మిన్ కన్సోల్ నుంచి ఆఫ్ చేయవచ్చు.

ఇదిలా ఉండగా గూగుల్ మీట్‌లో హార్ట్, థంబ్స్-అప్, పార్టీ పాపర్, క్లాప్, జోయ్, క్రై, థంబ్స్-డౌన్ ఎమోజీలను మాత్రమే అందుబాటులో ఉన్నాయి.త్వరలో మరిన్ని ఎమోజీ రియాక్షన్లను కూడా గూగుల్ మీట్ అందుబాటులోకి తీసుకురానుంది.ఆండ్రాయిడ్ యూజర్లకు తప్ప మిగతా వారందరికీ ఈ ఫీచర్ రిలీజ్ అవుతున్నట్లు గూగుల్ తెలిపింది.

ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా అతి త్వరలోనే దీన్ని తీసుకురానున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube