ఏపీలో టిడిపి జనసేన పొత్తుల అంశం ఒక క్లారిటీకి వచ్చేసింది.స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువ గళం కార్యక్రమంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.
రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా టిడిపి తో పొత్తు పెట్టుకోబోతున్నట్లు ప్రకటించారు.ఒంటరిగా పోటీ చేస్తే 2019 లాగే 2024 ఎన్నికల్లోను ఫలితాలు వస్తాయని , ఒంటరిగా వీరమరణం పొందే కంటే టిడిపితో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడమే బెటర్ అన్నట్లుగా పవన్ మాట్లాడారు.
దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయం అయిపోయింది.ఇక సీట్ల విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది.
టిడిపి తో పొత్తు పెట్టుకోవడం ద్వారా జనసేనకు జరిగే నష్టమేమీ లేదు.టిడిపి జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లి గెలిస్తే… ప్రభుత్వం ను ఏర్పాటు చేస్తే పవన్ తో పాటు , ఆ పార్టీ నాయకులకు కీలక పదవులే దక్కుతాయి.
ముఖ్యమంత్రి స్థానాన్ని ఏ విధంగా పంచుకుంటారనేది జరగబోయే చర్చల్లో క్లారిటీ రాబోతుంది.ఎలా చూసిన ఈ పొత్తు రెండు పార్టీలకు లాభంగానే ఉంటుంది.

ఇదిలా ఉంటే టిడిపి నియోజకవర్గస్థాయి నాయకులు మాత్రం ఈ విషయంలో టెన్షన్ పడుతున్నారు.ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ప్రకటించిన బాబు మిగతా నియోజకవర్గాల్లో ఏ నిర్ణయం తీసుకోలేదు.కొన్ని కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించారు.వారికి టికెట్ ఇస్తామని హామీను ఇచ్చారు.మరి కొంతమందిని నియోజకవర్గాల్లో పని చేసుకోవాలిని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.దీనికోసం ఎవరికి వారే సొంత సొమ్ములను వెచ్చిస్తూ నియోజకవర్గంలో తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరికొన్ని చోట్ల టికెట్ దక్కుతుందనే ఆశతో చాలామంది పార్టీ కార్యక్రమాల కోసం సొమ్ములు వెచ్చిస్తున్నారు.అయితే ఇప్పుడు జనసేనతో పొత్తు కారణంగా ఆ సీటు తమకు దక్కుతుందో లేదో అన్న అనుమానం మొదలైంది.

ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు , కోస్తా లోను ఈ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది.పొత్తు లో భాగంగా తాము ఆశలు పెట్టుకున్న నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే తాము ఇప్పటివరకు పెట్టిన ఖర్చు అంతా వృధా అవుతుందని, భారీగానే నష్టపోవాల్సి వస్తుందనే టెన్షన్ ఆయా నియోజకవర్గ టికెట్లు ఆశిస్తున్న నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది.అసలు జనసేనకు ఎన్ని సీట్లు ? ఏ ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారు అనేది క్లారిటీ ముందుగానే వస్తే బాగుంటుందని, ఎన్నికల సమయం వరకు ఈ వ్యవహారాన్ని నాన్చడం ద్వారా టిడిపి టికెట్లు ఆశిస్తున్న వారే ఎక్కువగా నష్టపోతారనే అభిప్రాయం పార్టీ నేతల్లో కనిపిస్తోంది.జనసేన టిడిపి పొత్తులో భాగంగా 70 నియోజకవర్గాలు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న, 45 సీట్లకే జనసేన ను పరిమితం చేస్తారని తెలుస్తోంది.







