సినిమాలలో నటిద్దామనుకుంటున్నాను.. మీరేమంటారు? సీనియర్ నటుడు పోస్ట్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ కమెడియన్ ఎల్ బి శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించి తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

 Lb Sriram Variety New Year Wishes 2023 ,lb Sriram, Comedian Sriram, Tollywood, N-TeluguStop.com

దాదాపుగా ఎల్బీ శ్రీరామ్ 100కు పైగా సినిమాలలో నటించి మెప్పించాడు.కమెడియన్ గానే కాకుండా అమ్మో ఒకటో తారీకు లాంటి సినిమాలలో సీరియస్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నాడు.30 ఏళ్ల సినీ కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు.సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మెప్పించాడు ఎల్బీ శ్రీరామ్.

సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును షార్ట్ ఫిలిమ్స్ ఖర్చు చేస్తూ సమాజానికి ఉపయోగపడే కథలను మాత్రమే ప్రేక్షకులకు చేరవేస్తూ వచ్చాడు.ఇక చాలా బాగుంది సినిమాతో నటుడిగా బ్రేక్ అందుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ కొత్త సంవత్సరానికి కొంచెం వెరైటీగా వెల్కమ్ చెప్పాడు.ఇండస్ట్రీలో సెలబ్రిటీలు న్యూ ఇయర్ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన నిర్ణయాన్ని తీసుకోగ, ఆ విధంగానే ఎల్బీ శ్రీరామ్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు.

ఎల్బీ శ్రీరామ్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకోవడంతోపాటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా ఎల్బీ శ్రీరామ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది.హాయ్ ఫ్రెండ్స్.కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా ఏదైనా చేద్దాం.

నేను సినిమాలో ట్రై చేద్దాం అనుకుంటున్నా.కొత్త కుర్రాన్ని కనుక కుర్ర వేషాలు వేస్తున్నా.

అంటూ ఫుల్ యంగ్ గా ఉండడం కోసం పసుపు రంగు చొక్క, తెల్ల నిక్కర్ ధరించి స్టైలిష్ గా కూలింగ్ గ్లాసెస్ కూడా పెట్టి నడుచుకుంటూ వస్తున్నట్లుగా ఒక ఫోటోని కూడా షేర్ చేశాడు.

ఆ ఫోటోలో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు ఎల్బీ శ్రీరామ్.ఇక ఆ ఫోటోని చూసిన అభిమానులు రచయితలకు వయసు ఏంటి మాస్టారు అని కొందరు కామెంట్స్ చేయగా, ఇంకొందరు మీరు నిత్య యవ్వనులు రచన ప్రత్యుత్పత్తి నిరంతరాయ ప్రక్రియ అని కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొంతమంది అభిమానులు లవర్ బాయ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ విషెస్ చెబుతున్నారు.

ఇంకొందరు ముసలితనం మనిషికి కానీ మనసుకు కాదు సార్ మీరు ఏం చెప్పినా అది నూతనమే అధునాతనమే అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో ఆయన ప్రశంసలు కురిపిస్తూ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు.ఇందుకు సంబంధించిన పోస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube