ఆ సినిమాలు రెండు హిట్ అవ్వాలని బలంగా కోరుకున్నా: రవితేజ

మాస్ మహారాజ రవితేజ శ్రీ లీల జంటగా త్రినాథ్ రావు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ధమాకా.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 I Strongly Wanted Both Those Films To Become Hits Ravi Teja , Ravi Teja, Sri Lee-TeluguStop.com

ఈ క్రమంలోనే సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రవితేజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి అలాగే తన కెరియర్ లో నటించిన సినిమాల గురించి పలు విషయాలను తెలియజేశారు.

రవితేజ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ నేడు హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ఈయన తన కెరియర్ లో నటించిన రెండు సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ, నేనింతే సినిమాలపై చాలా నమ్మకం ఉండేదని ఈ రెండు సినిమాలు మంచి హిట్ అవ్వాలని బలంగా కోరుకున్నానని ఈ సందర్భంగా రవితేజ ఈ రెండు సినిమాల గురించి చర్చించారు.అయితే ఇందులో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ పరవాలేదు అనిపించుకున్నప్పటికీ నేనింతే సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలిన సంగతి మనకు తెలిసిందే.ఇక తాజాగా ఈయన క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి డిజాస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఇప్పుడు ధమాకా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.ఈ సినిమా థియేటర్లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube