ఓటీటీ విడుదలకు సిద్ధమైన హిట్ 2 ఎప్పుడు... ఎక్కడంటే?

టాలీవుడ్ హీరో అడివి శేష్ వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్న శేష్ తాజాగా హిట్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Hit 2 Ready For Ott Release When Where , Hit 2 , Ott Release, Adivi Seshu , Disn-TeluguStop.com

ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది.ఇలా థియేటర్లో పలు భాషలలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ 2 భారీ ఎత్తున పోటీపడ్డాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రేమ్ కైవసం చేసుకున్నారు.థియేటర్లో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా జనవరి మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ విషయానికి సంబంధించి ఆమెజాన్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది.

ఇక ఈ సినిమాలో శేష్ సరసన బాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి జంటగా నటించారు.ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమెకు తెలుగులో విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.ఇక ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని నిర్మించిన విషయం మనకు తెలిసిందే.ఇక హిట్ 2 మంచి విజయాన్ని అందుకోవడంతో హిట్ 3 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇక థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న హిట్ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube