అట్లుంటది ఆర్పీతో.. తక్కువ సమయంలోనే పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేసిందా?

ప్రేక్షకుల్లో పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇస్తే సక్సెస్ కావడం కష్టం కాదనే సంగతి తెలిసిందే.ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఫుడ్ బిజినెస్ లో రాణిస్తున్నా వాటి గురించి ఎక్కువగా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.

 Jabardasth Comedian Rp Success In Business Details, Kirrak Rp, Rp Food Restauran-TeluguStop.com

అయితే సెలబ్రిటీలు సరైన విధంగా పబ్లిసిటీ చేసుకుంటే ఫుడ్ బిజినెస్ లో ఏ స్థాయిలో సక్సెస్ సాధించవచ్చనే ప్రశ్నలకు ఆర్పీ జీవితమే సమాధానంగా నిలుస్తుంది.

ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న ఆర్పీ ఒకానొక సమయంలో జబర్దస్త్ పెద్దలపై హద్దులు దాటి చేసిన విమర్శల వల్ల ఆర్పీకి అవకాశాలు తగ్గాయని కామెంట్లు వినిపించాయి.

అయితే కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కోసం 40 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టగా ఇప్పటికే పెట్టుబడి రికవరీ అయిందని సమాచారం అందుతోంది.

ఆర్పీ కర్రీ పాయింట్ ముందు భోజన ప్రియులు క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది.భోజన ప్రియులను కంట్రోల్ చేయడానికి బౌన్సర్లను ఆర్పీ నియమించారంటే ఈ బిజినెస్ ఏ స్థాయిలో క్లిక్ ఆయిందో అర్థమవుతుంది.రేట్లు మరీ ఎక్కువగా లేకపోవడం మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో రేట్లు ఉండటం వల్ల ఆర్పీ సక్సెస్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూల వల్ల ఆర్పీ రెస్టారెంట్ పాపులర్ అవుతోంది.

ఉదయాన్నే వందల సంఖ్యలో మంది క్యూ కడుతున్నారని ఆర్పీ చెబుతున్నారంటే అతని వ్యాపారం ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థమవుతుంది.విమర్శించిన వాళ్లే మెచ్చుకునేలా ఆర్పీ ఎదిగాడని అందరూ చెబుతున్నారు.అయితే రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాంచ్ ల దిశగా అడుగులు వేస్తున్న ఆర్పీ రిపీట్ గా వచ్చేవాళ్లే నా టార్గెట్ అని చెబుతున్నారు.

ఆర్పీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube