రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపికొండల యాత్ర ఎంతో ప్రత్యకమైనది.ఎందుకంటే శ్రీశైలంలో కృష్ణా నదిపై ప్రత్యేక ఉండడంతో అదే విధంగా తెలంగాణ నుంచి గోదావరిలో మళ్లీ పాపికొండల యాత్ర మొదలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇది ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉన్న ఈ సంవత్సరం మొన్నటిదాకా వానలు కురవడం, ఇప్పుడు వానలు ఆగడంతో తెలంగాణ పర్యాటక శాఖ తిరిగి ఈ యాత్రను మొదలుపెట్టి ఉండాలని ఆలోచనలో ఉంది.ఈ యాత్రకు వెళ్లాలి అనుకునేవారు తెలంగాణ టూరిజం శాఖ ప్యాకేజీ ప్రకారం వెళ్లవచ్చు.
దీనికోసం ప్రతి శుక్రవారం రాత్రి 7:30 నిమిషములకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి బస్సు బయలుదేరుతూ ఉంటుంది.ఈ బస్సు శనివారం ఉదయం ఐదు గంటలకు భద్రాచలం చేరుకుంటుంది.
భద్రాచలంలో పవిత్ర స్నానాలు చేసే భక్తులు ఉదయం ఏడు గంటలకు సీతా సమేత శ్రీరామ చంద్రమూర్తిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
అలాగే స్వామివారి దర్శనం తర్వాత భక్తులు ఉదయం 8:30కు పోచారం బోటింగ్ పాయింట్ కు చేరుకునే అవకాశం ఉంటుంది.పేరంటాలపల్లి మీదుగా కొల్లూరు వెళ్ళవచ్చు.బోటులోనే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి కొల్లూరులో ఉన్న వెదురు ఇల్లు లో ఉంటారు.
మూడో రోజు అయిన ఆదివారం ఉదయం కొల్లూరులో నదీ స్నానం చేసి టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేసి పోచారం బయలుదేరవచ్చు.వర్ణశాలను చూసి తిరిగి భద్రాచలం రావచ్చు.
భద్రాచలంలోని హరిత హోటల్లో రాత్రి భోజనం చేయవచ్చు.
అదే రోజు రాత్రి 9 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి సోమవారం ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ వచ్చేయొచ్చు.ఈ టూర్ తెలంగాణ టూరిజం శాఖ టికెట్ ధర పెద్దలకు 6499 రూపాయలుగా పిల్లలకు 5199 రూపాయలుగా నిర్ణయించింది.ఏపీ బస్సుల్లో ప్రయాణం ఉంటుందని నాన్ ఎసి వసతి ఉంటుందని కూడా తెలిపింది.
ఈ టోటల్ టూర్ లో గోదావరిలో ప్రయాణించేది తక్కువ సమయమే ఉంటుంది.గోదావరిలో ఇదివరకు జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ టూర్ ప్యాకేజీలో తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉంది.