Hansika: మీ ఫ్రెండ్ భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్.. నీకు ఇంకా ఎవరు కనిపించలేదా.. హన్సికకు నెటిజన్స్ షాకింగ్ ప్రశ్నలు?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు చాలావరకు వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తారు.ముఖ్యంగా వారి పెళ్లి విషయాలలో మాత్రమే వైరల్ అవుతూ ఉంటారు.

 Netzens Trolling Hansika Over Marrying Her Friends Husband Details,   Hansika ,-TeluguStop.com

ఎందుకంటే వారు చేసుకునే పెళ్లిలు అలా ఉంటాయి.ఒక్క పెళ్లి తో సరిపెట్టుకోకుండా రెండు లేదా మూడు వీలైతే నాలుగో పెళ్ళికూడా చూసుకుంటూ ఉంటారు.

కొన్ని కొన్ని సార్లు అంతకుముందే పెళ్లయిన వ్యక్తులను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.అలా ఇప్పటికి చాలామంది ఇటువంటి వ్యవహారాలలో వైరల్ అయ్యారు.

తాజాగా మరో హీరోయిన్ కు కూడా తన పెళ్లి వ్యవహారం గురించి బాగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటి, గ్లామర్ బ్యూటీ హన్సిక. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది హన్సిక.

ఈ బ్యూటీ తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2001లో చిన్న వయసులోనే అడుగు పెట్టింది.

అలా చిన్న వయసులోనే పలు సినిమాలలో నటించింది.ఆ తర్వాత బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది.

ఇక ఈమె 2007లో హీరోయిన్ గా తన పరిచయాన్ని పెంచుకుంది.అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Telugu Hansika, Hansika Friend, Hansika Motwani, Hansika Sohail, Sohail Katuriya

ఇక ఈ సినిమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.చాలా వరకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక వ్యక్తిగతం పట్ల హన్సిక మంచి పేరు సంపాదించుకుంది.

తను ప్రతి ఏడాది తన ప్రతి పుట్టిన రోజున ఒక అనాథ అమ్మాయి లేదా అబ్బాయిని దత్తత తీసుకుంటుందని తెలిసింది.

వారికి అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని.

ఆ మధ్య కొందరి అనాధ పిల్లలకు తన వంతు సహాయం చేసిందని తెలిసింది.అలా ఒక నటిగా కాకుండా వ్యక్తిగతంగా కూడా అభిమానుల హృదయాలను దోచుకుంది.

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.నిత్యం తనకు సంబంధించిన విషయాలనే కాకుండా అప్పుడప్పుడు అభిమానులతో కూడా తెగ ముచ్చట్లు పెడుతుంది.

వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఫోటో షూట్ లతో బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.అవి పంచుకున్న కొన్ని క్షణాల్లోనే తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి.

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

Telugu Hansika, Hansika Friend, Hansika Motwani, Hansika Sohail, Sohail Katuriya

నిజానికి కొత్త హీరోయిన్ లు రావడంతో ఈ అమ్మడికి అవకాశాలు రాలేకపోతున్నాయి.అయితే ఇంతకాలం మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తన పెళ్లి విషయంలో మాత్రం బాగా ట్రోల్స్ ఎదుర్కుంది.ఇటీవలే ఈ ముద్దుగుమ్మ తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఆమె పెళ్లి చేసుకుంది ఎవరో కాదు తన ఫ్రెండు భర్తని.

తన బెస్ట్ ఫ్రెండ్ గతం లో అతడిని పెళ్లి చేసుకోగా ఇక వీరిద్దరూ కొన్ని మనస్పర్దాలతో విడిపోయారు.

ఆ తర్వాత హన్సిక అతడిని లవ్ చేసి మొత్తానికి ఇటీవలే పెళ్లి చేసుకుంది.అయితే తాజాగా అతని పెళ్లికి సంబంధించిన ఫోటోలు పంచుకోగా ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్స్ తనపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.దీంతో ఈమెకు బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.

మీ ఫ్రెండ్ భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్.నీకు ఇంకా ఎవరు కనిపించలేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక మరి కొంతమంది.నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube