ఈ ప్రపంచంలో అనేక అందాలు ఉన్నాయి.ఏపుగా పెరిగిన అడవులు, అందమైన సరస్సులు, కనువిందు చేసే జలపాతాలు, మంచు కొండలు, పర్వతాలు, లోయలు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలానే ఉంది.ఇందులో కొన్ని వింతగా ఉన్నాయి.
కొన్ని ప్రదేశాలు అందర్నీ ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంటాయి.మరి అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి.
అందులో ప్రశార్ లేక్ కూడా ఒకటి.ఇది ఒక అందమైన ద్వీపం.
చుట్టూ కొండలు ఉన్నా మధ్యలో సరస్సు అందంగా కనిపిస్తుంటుంది.ప్రకృతి ప్రేమికులకు ఇదొక స్వర్గంలా అనిపిస్తుంది.
దీన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి జనాలు ఇక్కడికి వస్తుంటారు.మరి ఇది ఎక్కడుంది? దీని గురించి ముఖ్య విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రశార్ లేక్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలో ఉంది.2,730 మీటర్ల ఎత్తులో ఈ సరస్సు ఉంది.ఇదొక మంచి నీటి సరస్సు.మండి పట్టణానికి సుమారుగా 49 కిలో మీటర్ల దూరంలో ఈ సరస్సు ఉంది.ఇటువంటి సరస్సు ఒడ్డున మూడు అంతస్తులతో దేవాలయం ఉంది.చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది.
ఒక చెట్టు నుంచి పుట్టిన శిశువు ఈ గుడిని కట్టమని చెప్పినట్లుగా చరిత్ర చెబుతోంది.ఇటువంటి స్థల పురాణం ఉన్న ఈ ప్రాంతానికి చాలా మంది భక్తులు పోటెత్తుతుంటారు.
అయితే ఇప్పటి వరకూ కూడా ఈ సరస్సు లోతును ఎవ్వరూ తెలుసుకోలేక పోయారు.ఒక్కో సీజన్ లో ఒక్కో రకమైన అందంతో ఈ సరస్సు ఉంటుంది.
అందుకే పర్యాటకులు ఇక్కడ గడపడానికి ఎక్కువగా తరలి వస్తుంటారు.ఆలయంలో ప్రతి రోజూ కూడా పూజలు, ఉత్సవాలనేవి శాస్త్రబద్దంగా నిర్వహిస్తుంటారు.
ఇంతటి అందమైన ప్రదేశాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే.