సీఎం కేసీఆర్ పర్యటనపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.ముఖ్యమంత్రి వస్తున్నారని ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
హామీలు చేయాలంటే అరెస్ట్ చేయడం సరికాదన్నారు.కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామిక చర్య అన్న రేవంత్ రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని తెలిపారు.
దామరచర్లలో గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఆయన దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమకుందన్నారు.కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
అదేవిధంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.