25 కోట్ల బడ్జెట్ తో యశోద సినిమా సమంత హీరోయిన్ గా తెరకెక్కించగా, పెద్ద తోపుగా కాకపోయినా నష్టాలూ లేకుండా బి సెంటర్ లలో బాగానే టాక్ తెచ్చుకుంది.ఆమె హీరోయిన్ గా మొదటి రోజు బ్రహ్మాండం బద్దలయ్యే ఓపెనింగ్స్ వస్తాయని ఆశించడం వంటివి చేయడం కాస్త తెలివి తక్కువ పనే.
ఎందుకంటే స్టార్ హీరోలు సైతం ఇక్కడ అల్లాడుతున్నారు ఓపెనింగ్స్ రాబట్టడానికి.మరి అలాంటి సమయంలో సమంత పర్వాలేదు అనిపించుకున్న యశోద సినిమా ఇక గతం.ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న శాకుంతలం సినిమా గురించి ఇప్పుడు పెద్ద చర్చ సాగుతుంది.ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 70 కావడం తో ఓపెనింగ్స్ రాకపోతే సినిమా ఎలా నిలబడుతుంది అనేది పెద్ద ప్రశ్న.
మిగతా సినిమాల విషయానికి వస్తే సినిమా బడ్జెట్ ని వందల కోట్లకు పెంచుతూ అనవసరమైన గ్రాఫిక్స్ తో రిచ్ నెస్ పెంచుతాం అంటే నెపం తో ప్రొడ్యూసర్ కి తడిసిపోయేలా చేస్తున్నారు.ఇప్పుడు గుణ శేఖర్ వంతు వచ్చింది.
ఈ సినిమా కు బడ్జెట్ కాస్త పెద్దదే.కానీ గుణ శేఖర్ కి గ్రాఫిక్స్ పైన పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు.
అతడు కేవలం సెట్స్ విషయంలో మాత్రమే ఎక్కువ ఖర్చు చేస్తాడు.అప్పుడెప్పుడో లాక్ డౌన్ కి ముందు మొదలు పెట్టిన శాకుంతలం సినిమా 2021 లో షూటింగ్ మొదలు పెట్టి ఇప్పటికి ఎలాంటి అప్డేట్ లేకుండా అప్పు తెచ్చిన డబ్బు కు వడ్డీల మీద వడ్డీలు పెంచుతూ పోతుంది.
ఇక ఈ సినిమాకు సహా నిర్మాత మరియు పంపిణి దారుడిగా ఉన్నది మరెవరో కాదు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు.ఇక సినిమా షూటింగ్ అయితే పూర్తయ్యింది కానీ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనేది మాత్రం క్లారిటీ లేదు.ఇక ఇప్పుడు ఈ గ్రాఫిక్స్, రిలీజ్ డేట్స్ కన్నా పెద్ద సమయ ఏంటంటే మంచు మోహన్ బాబు.శాకుంతలం సినిమాలో మోహన్ బాబు దుర్వాసన మహర్షి పాత్ర లో నటిస్తున్నాడు.
ఇక మంచు వారి సినిమాల పైన, వారి కుటుంబం పైన ఎలాంటి ట్రోల్ల్స్ నడుస్తున్నాయి కళ్లారా చూస్తున్నాం.జిన్నా సినిమా ఫలితాన్ని కూడా చూసాం కదా.మరి ఇన్ని సమస్యల నడుమ శాకుంతలం పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.