టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది.
ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం ఉంటుందని ప్రకటించారు.ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది అవుతున్నప్పటికీ ఇంకా సీక్వెల్ చిత్రం గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని గత కొన్ని నెలలుగా చెబుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే ఎన్నో మార్లు ఈ సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసినప్పటికీ ఇటు చిత్ర బృందం అటు మైత్రి మూవీ మేకర్స్ ఏ మాత్రం స్పందించలేదు.
దీంతో అభిమానులు ఒక్కసారిగా గీతా ఆర్ట్స్ బ్యానర్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ తమకు పుష్ప 2 అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.అయినప్పటికీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఏకంగా తమకు పుష్ప 2 అప్డేట్ కావాలంటూ అభిమానులు బ్యానర్లు పట్టుకొని రోడ్డుకేక్కారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
పుష్ప సినిమా సక్సెస్ చూసిన తర్వాత అభిమానులు పుష్ప 2 కోసం ఇలా బ్యానర్లు చేతపట్టి రోడ్డుకెక్కారు.ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదంటూ ఈయన చెప్పుకొచ్చారు.ఇలా ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎంతోమంది అల్లు అర్జున్ కి ఉన్నటువంటి క్రేజ్ చూసి సంతోషం వ్యక్తం చేయగా.
మరికొందరి హీరోల అభిమానులు మాత్రం సినిమా అప్డేట్ కోసం ఇలా రోడ్డుకి ఎక్కడం ఏంటి మరి టూ మచ్ కాకపోతే అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.