Dhanush Sir movie: రూమర్స్ నిజమే.. సార్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్!

విభిన్నమైన సినిమాలతో ఎప్పుడు ఆకట్టుకునే హీరోల్లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకరు.జాతీయ అవార్డు సైతం అందుకున్న ధనుష్ కు కోలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ఉంది.

 New Release Date Fixed For Dhanush Sir Vaathi, Sir Movie, Sir Movie Release Date-TeluguStop.com

ఇక ఇప్పుడు ధనుష్ తెలుగులో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని తాపత్రయ పడుతున్నాడు.ఇంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే కానీ ఇప్పుడు వరకు డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రెసెంట్ ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.తమిళ్ లో ‘వాతి‘ పేరుతో.

తెలుగులో ‘సార్‘ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమా షూట్ పూర్తి అవుతున్న నేపథ్యంలోనే ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలిపారు.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గత కొన్ని రోజుల నుండి రూమర్స్ వినిపిస్తున్నాయి.ఈ సినిమా వాయిదా పడబోతోంది అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది.

ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఈ సినిమా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు.కొత్త ఏడాదిలో ఫిబ్రవరి 17, 2023న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Telugu Dhanush, Kollywood, Fixeddhanush, Sir, Tollywood, Venky Atluri-Movie

రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ధనుష్ ఫార్మల్ షర్ట్ ధరించి విద్యార్థుల సమూహంతో రౌండప్ చేయబడి కాలేజ్ మెట్ల మీద కూర్చున్నాడు.ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే సాయి కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటెర్టైనమెంట్స్ ఇంకా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube