Balakrishna Unstoppable With NBK 2: కృష్ణ మృతి ఎఫెక్ట్‌.. బాలకృష్ణ ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశ

నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 యొక్క కొత్త ఎపిసోడ్ రేపు శుక్రవారం స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గత వారం బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ కార్యక్రమం లో బిజీగా ఉండడం వల్ల కొత్త ఎపిసోడ్ ని చేయలేక పోయాడు.

 Balakrishna Unstoppable Season 2 New Episode Details, Aha Ott, Balakrishna, Bala-TeluguStop.com

కానీ ఈ వారం ఎట్టి పరిస్థితు ల్లో ప్రేక్షకుల ముందుకు కొత్త ఎపిసోడ్ తో రావాలని నిర్ణయించుకున్నాడు.

అందుకోసం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు సీనియర్ హీరోయిన్ రాధిక లను గెస్టులుగా ఆహ్వానించారు.

అయితే సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడం తో షూటింగ్ కార్యక్రమాలు ఆలస్యమయ్యాయి.నిన్న షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయినట్లుగా ఆహా వారు అధికారికంగా ప్రకటించారు.

షూటింగ్ పూర్తి అయిన వెంటనే విడుదల చేయడానికి అదేమీ సీరియల్ కాదు.కనుక కొత్త ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అవ్వడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం అయినా కావాల్సి ఉంటుంది.

సూపర్ స్టార్ కృష్ణ మృతి కారణం గా ఈ వారం ఎపిసోడ్ కూడా రాదేమో అని అనుకుంటున్న సమయం లో

Telugu Aha Ott, Balakrishna, Telugu, Radhkasharath, Krishna, Unstoppable-Movie

ఆహా వారు అధికారికంగా షూటింగ్ పూర్తి అయిందని ప్రకటించడం తో ఒక రోజు లేదా రెండు రోజుల ఆలస్యం గా అయినా ఈ వారం బాలయ్య అన్ స్టాపబుల్ ఉంటుంది అని అభిమానులు భావిస్తున్నారు.బాలకృష్ణ సినిమా వీర సింహా రెడ్డి షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.సంక్రాంతి కి సినిమా విడుదల కావాల్సి ఉంది.కనుక షూటింగ్ వాయిదా వేయలేరు, అందుకే ఈ కార్యక్రమం యొక్క ఎపిసోడ్స్ వాయిదా వేస్తూ వస్తున్నారు అంటూ బాలయ్య అభిమానులు చర్చించుకుంటున్నారు.

బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube