శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరైంది.ఈ మేరకు పీఎంఎల్ఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ అరెస్ట్ అయ్యారు.పాత్రాచాల్ రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
దీనిలో భాగంగానే సుమారు ఆరు గంటల పాటు విచారించిన తర్వాత ఆగస్ట్ 1న ఈడీ అరెస్ట్ చేసింది.