ఎ.కోదండరామి రెడ్డి .తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన ఒక ఆణిముత్యం.హీరో కావాలనే ఉద్దేశం తో మద్రాసు రైలెక్కి తనకు దగ్గరి బంధువు ఆయన నటుడు ప్రభాకర్ రెడ్డి ని వెళ్లి కలిసాడు.
ఆ తర్వాత తాను హీరో మెటీరియల్ కాదని గ్రహించి మనుషులు మారాలి సినిమాకు దర్శకత్వం వహించిన వి.మధుసూదన్ రావు దగ్గర దాదాపు ఏడేళ్ల పాటు సహాయ దర్శకుడిగా, అస్సోసియేటివ్ దర్శకుడిగా, కో- డైరెక్టర్ గా పని చేసాడు.సినిమాకు దర్శకత్వం వహించడానికి కావాల్సిన అనుభవం సంపాదించుకున్నాక రామ్ రాబర్ట్ రహీం అనే సినిమాకు తొలుత దర్శకత్వం వహించే అవకాశం లభించింది.కానీ నిర్మాత కొత్త దర్శకుడితో రిస్క్ చేయడానికి భయపడటం తో ఆ ప్రాజెక్ట్ కోదండరామి రెడ్డి నుంచి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత హీరోయిన్ సుజాత మరియు శ్రీధర్ మెయిన్ లీడ్ గా సంధ్య అనే సినిమాకు దర్శకత్వం వహించగా అది పర్వాలేదనిపించుకుంది.రెండవ సినిమా చిరంజీవితో న్యాయం కావలి.
ఈ సినిమా ఘన విజయం సాధించింది.ఆ తర్వాత కోదండరామి రెడ్డి కి అనేక సినిమా అవకాశాలు వచ్చాయి.
చిరంజీవితో ఏకంగా 25 సినిమాలు తీసాడు.ఒక్క ఎన్టీఆర్ మినహా అప్పటి హీరోలందరితోను సినిమాలు చేసిన ఘనత కోదండరామి రెడ్డి కే దక్కింది.
ఇక కృష్ణ తో పల్నాటి సింహం , కోటి గాడు.ఖైదీ రుద్రయ్య వంటి మంచి సినిమాలు తీసాడు.
నాగార్జున తో కిరాయి దాదా, ప్రెసిడెంటు గారి పెళ్ళాం, విక్కీ దాదా, అల్లరి అల్లుడు వంటి హిట్ సినిమాలు తెరకెక్కించారు.
బాలయ్య తో నారి నారి నడుమ మురారి, అనసూయమ్మ గారి అల్లుడు.భానుమతి గారి మొగుడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ, నిప్పు రవ్వ, భార్గవ రాముడు, బొబ్బిలి సింహం వంటి సినిమాలు తీసిన కోదండరామి రెడ్డి కమల్ హాసన్ మరియు అక్కినేని వంటి హీరోలను కూడా డైరెక్ట్ చేసాడు.ఇక అయన కెరీర్ లో చిరంజీవి తో తీసిన సినిమాలు అటు చిరు కి ఇటు కోదండరామి రెడ్డి కి మంచి స్టార్డం తీసుకవచ్చాయి.
అందులో ముఖ్యంగా అభిలాష, ఛాలెంజ్, పసివాడి ప్రాణం.దొంగ మొగుడు, కొండవీటి దొంగ త్రినేత్రుడు, మరణ మృదంగం వంటి మంచి హిట్ సినిమాలు ఉండటం విశేషం.కోదండరామి రెడ్డి కి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా 16 సినిమాలకు దర్శకత్వం వహించిన రికార్డు కూడా వుంది.