ఐదు రాష్ట్రాల్లో పలు స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.ఇందులో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని పలు స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది.
ఈ మేరకు ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానానికి షెడ్యూల్ విడుదలైంది.కాగా ఇటీవల ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఆయన మరణంతో మొయిన్ పురి పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది.యూపీ, ఒడిశా, రాజస్థాన్, బీహార్ తో పాటు ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు ఈనెల 10న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈసీ విడుదల చేయనుంది.అదేవిధంగా ఈనెల 17 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది.
డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించింది.