టెక్నాలజీ డైలీ కొత్తపుంతలు తొక్కుతుంది.రోజు ఏదో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఏదో కొత్త విషయాన్నీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.
అందులో భాగంగానే మొబైల్ యూజర్ల కోసం గూగుల్ మీట్ మరో కొత్త ఫీచర్ తో యూజర్లను ఆకట్టుకోనుంది.ఇప్పటివరకూ ఆడియో, వీడియో కాల్ మాత్రం అందుబాటులో ఉండేది.
గూగుల్ మీట్ కాల్స్ లో జరిగే మాటలను సైతం ఇప్పుడు టెక్స్ట్ రూపంలో చూసే ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది.అంతేకాదు దీన్ని గూగుల్ డాక్ ఫార్మాట్లోనూ సేవ్ చేసుకునే అవకాశాన్నీ కల్పించనుంది.
భవిష్యత్తులో వీటిని గూగుల్ డ్రైవ్ నుంచి యాక్సెస్ చేసుకొవచ్చని ఆ కంపెనీ తెలిపింది.గూగుల్ డ్యుయో యాప్ స్థానంలో డెస్క్ టాప్ లేదా లాప్ టాప్, మొబైల్ యూజర్ల కోసం మీట్ ను ఇంతకు మునుపే తీసుకొచ్చింది.
తాజాగా ఇందులో ట్రాన్స్ స్కైబ్ ఫీచర్ ను గూగుల్ పరిచయం చేసింది.
గూగూల్ మీట్ లో వీడియో కాల్ స్టార్ట్ అయిన తర్వాత.
కాల్ ట్రాన్స్ స్కైబ్ అవుతున్నట్లు యూజర్లు తెలియజేస్తుంది.దానిపై క్లిక్ చేస్తే, సమావేశంలో చర్చించుకుంటున్న అంశాలను రికార్డు చేయడం ప్రారంభిస్తుంది.
కాల్ పూర్తయిన తర్వాత రికార్డు చేసిన ఆడియోను టెక్స్ట్ మార్చి మీట్ కు అనుసంధానంగా డ్రైవ్ స్టోరేజ్ లో ఉన్నమీట్ రికార్డింగ్స్అనే ఫోల్డర్లో సేవ్ చేస్తుంది.ఈ ఫైల్ ను మీటింగులో పాల్గొన్న సభ్యులెవరైనా యాక్సెస్ చేయొచ్చు.
అయితే ఈ సేవలను అక్టోబరు 24 నుంచి ఈ ఫీచర్ ను గూగుల్ వర్క్ స్పెన్ బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్ప్రైజ్ స్టార్టర్, ఎంటర్ప్రైజ్ స్టాండర్డ్, ఎడ్యుకేషన్ ప్లస్, టీచింగ్, లెర్నింగ్ అప్గ్రేడ్ కస్టమర్లకు పరిచయం చేయనున్నారు.
తర్వాత సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం.ఇటీవలే గూగుల్ యూజర్ల ప్రైవసీ కోసం పాస్కీ అనే ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.దీంతో యూజర్లు పాస్వర్డ్ అవసరం లేకుండానే ఖాతాల్లోకి లాగిన్ చేయొచ్చు.
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంటే ఇది ఎంతో మెరుగ్గా ఉంటుందని గూగుల్ భావిస్తోంది.ప్రస్తుతం డెవలపర్స్ కు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు గూగుల్ తేలిపింది.