ఒక మారుమూల ప్రాంతం నుండి సినిమాల్లో సత్తా చాటాలంటూ వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా తక్కువ సమయంలోనే మాటల మాంత్రికుడు గా పేరు దక్కించుకుని అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్న ఘనతను సొంతం చేసుకున్నాడు.1999 సంవత్సరంలో స్వయంవరం అనే సినిమాకు కథను మరియు డైలాగ్స్ ని ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడుగా మొదటి సినిమాను 2002 సంవత్సరంలో చేయడం జరిగింది.తరుణ్ శ్రియ హీరో హీరోయిన్ గా నువ్వే నువ్వే సినిమా రూపొందింది.ఆ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా ఒక భారీ వేడుకను చిత్ర యూనిట్ సభ్యులు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ 20 ఏళ్ల సినీ కెరియర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు తక్కువ అనే చెప్పాలి.ఆయన సినిమా సినిమాకు కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడు.
మొదటి సినిమా 2002 సంవత్సరంలో విడుదల అవ్వగా, తదుపరి సినిమా రావడానికి చాలా సమయం పట్టింది.దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో అతడు సినిమాను చేశాడు.
మహేష్ బాబు అవకాశం ఇచ్చిన అతడు సద్వినియోగం చేసుకోలేక పోయాడు అంటూ త్రివిక్రమ్ కి ఆఫర్స్ పెద్దగా రాలేదు.ఆ సమయంలోనే మళ్ళీ మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి జల్సా ఆఫర్ వచ్చింది.
జల్సా సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మళ్లీ మహేష్ బాబు ఖలేజా సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు.ఖలేజా సినిమా నిరాశ పరిచింది.
దాంతో మళ్లీ రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ తో జులాయి సినిమాను చేసి ఆ సినిమాతో కూడా సక్సెస్ దక్కించుకున్నాడు.
ఆ తర్వాత సంవత్సరం 2013లో అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.2015లో సన్నాఫ్ సత్యమూర్తి, 2016లో సమంత అ ఆ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.2018లో ఎప్పుడు లేని విధంగా అజ్ఞాతవాసి మరియు అరవింద సమేత సినిమాలను ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.2020లో అలవైకుంఠపురంలో సినిమాతో అల్లు అర్జున్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాను చేస్తున్న త్రివిక్రమ్ 2023 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కరోనా ఇతర కారణాలవల్ల అల వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ ఇచ్చిన కూడా మూడు సంవత్సరాల గ్యాప్ త్రివిక్రమ్ కు వచ్చింది.ఆయన సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ముందు ముందు అయినా త్రివిక్రమ్ నుండి వరుసగా సినిమాలో స్థాయేమో చూడాలి వస్తాయేమో చూడాలి.