బిగ్ బాస్ తెలుగు సీజన్స్ కి ఇచ్చిన బడ్జెట్స్ మరియు రెమ్యూనరేషన్స్ !

బిగ్ బాస్. ప్రస్తుతం ఈ పేరు ఒక సంచలనం.

 Bigg Boss Seasons Budgets And Remunerations Details, Bigg Boss Budgets, Bigg Bos-TeluguStop.com

ఇందులోకి వెళ్లాలనుకునేవారు కొంతమంది అయితే లోపలికి వెళ్ళాక బయటకు రావాలనుకునేవారు మరి కొంత మంది.ఏది ఏమైనా బిగ్ బాస్ షో మాత్రం గట్టిగానే నడుస్తోంది.

ఇప్పటికీ 6 సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ కి ఒక్కో సీజన్ కి ఎంత ఖర్చు వస్తుంది ? ఎంత బడ్జెట్ పెడుతున్నారు ? ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే విషయం తో మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.బిగ్ బాస్ బడ్జెట్ సీజన్ సీజన్ కి మారుతూ వస్తుంది.

అందులో బిగ్ బాస్ సీజన్ 1 కి ఆర్గనైజర్స్ 45 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించారు.దీంట్లోనే సెలబ్రిటీస్ రెమ్యునరేషన్స్, బిగ్ బాస్ హౌస్ యొక్క ఫెసిలిటీస్, స్పెషల్ మెడికల్ టీం, 24 గంటలు టెక్నీషియన్స్, ఇంటి సభ్యులకు కావలసిన అవసరాలు, హోస్ట్ రెమ్యూనరేషన్ వంటి అన్ని అవసరాలు పూర్తి చేశారు.

ఇక ఆ తర్వాత సీజన్స్ కి ఆ అమౌంట్ రెట్టింపు అయినట్టుగా సమాచారం.ఇక హోస్ట్ రెమ్యునరేషన్స్ విషయానికి వస్తే, మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో ఎపిసోడ్ కి 50 లక్షల రూపాయల పారితోషకం తీసుకునేవాడు, నాని ఒక్కో ఎపిసోడ్ కి 10 లక్షలు తీసుకుంటే, నాగార్జున 15 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు.

ఈ మధ్యకాలంలో నాగార్జున అన్ని ఎపిసోడ్స్ కలిపి 11 నుంచి 12 కోట్ల రూపాయల వరకు పారితోషకంగా పుచ్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక హిందీ కోసం సల్మాన్ ఖాన్ మొదటి నుంచి కోట్ల రూపాయల్లోనే ప్రతి ఎపిసోడ్ కి ఛార్జ్ చేస్తూ వస్తున్నాడు.

Telugu Bigg Boss, Biggboss, Nani, Ntr, Kamal Hasan, Nagarjuna, Salman Khan-Movie

అవి వేసుకునే కోట్ల లేదా దాచుకునే కోట్ల అనే విషయం తెలీదు కానీ, 2010 వరకు సల్మాన్ ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్లు మాత్రమే పారితోషకం తీసుకున్న, ఇప్పుడైతే ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు అందుకుంటున్నాడు.తమిళ్ లో కమల్ హాసన్ మాత్రం ఎపిసోడ్ కి రెండు నుంచి మూడు కోట్ల వరకు అందుకుంటుండగా, దాదాపుగా మిగతా అన్ని భాషల్లో కూడా 20 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అందుకుంటున్నారు.ఇక కంటెస్టెంట్ విషయానికొస్తే వారి వారి ఫెమ్ ని బట్టి రెమ్యూనరేషన్ అనేది డిసైడ్ చేస్తారు.ఆ రెమ్యూనరేషన్ వారానికి ఒకటి నుంచి ఏడు లక్షల వరకు ఉంటుంది.

హిందీలో అయితే మరో లక్ష ఎక్కువగా దొరుకుతుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube