చిన్న పిల్లలు చాలా మంది కొత్తవారిని చూస్తే ఎంతో భయపడతారు.కొత్తవారినీ చూడగానే భయపడి ఏడుస్తారు.
ఇలా పిల్లలకు కొత్తవారంటే భయం ఉండటం సహజమే.పిల్లల్లో మూడు, నాలుగు నెలల నుంచే కొత్తవారంటే భయం ఏర్పడుతుంది.
ఈ భయం రెండు సంవత్సరాల వరకు ఉంటుంది.కొంతమంది పిల్లలకు కొత్త, పాత అన్న తేడా ఉండదు.
ఎలాంటి భయం లేకుండా కొత్తవారి దగ్గరకు కూడా చనువుగా వెళ్లిపోతారు.ఇటువంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు.
అయితే చిన్న పిల్లల విషయంలో తల్లులు చిరాకు పడకూడదు.చంక దిగడానికి ఏడ్చే పిల్లలను లాలిస్తూ, బజ్జగిస్తూ ఇంట్లో వారిని, ఇరుగు పొరుగువారిని అలవాటు చేస్తూ వారి దగ్గరకు కూడా వెళ్లేటట్లు చేయాలి.
తల్లి ఇలా అలవాటు చేయడం వల్లన పిల్లలు క్రమ క్రమంగా ఇతరులంటే భయం లేకుండా వారి దగ్గరకు కూడా వెళ్లేందుకు ఇష్టపడతారు.ఇకపోతే ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు చిన్న పిల్లల విషయంలో ఈ సమస్య తప్పదు.
ఇంట్లో ఉండే పెద్దవారికి గానీ, పిల్లలకు గానీ పిల్లలను ముందు కొంత ఓర్పుతో అలవాటు చేయాలి.బలవంతంగా పిల్లలను ఇతరులకు అప్పగించంకూడదు.అలాగే చిన్న పిల్లలను బుజ్జగింపు మాటలతో, చేతలతో ఇతరులు కూడా మన వాళ్లేనన్న భావాలను పిల్లలకు కలిగిస్తూ నిదానంగా పిల్లల్లో భయన్ని పోగొట్టాలి.
ఆ తర్వాత భయం పోయిన పిల్లలు ఇతరులపై నమ్మకం, వారి పట్ల ఇష్టాన్ని కూడా పెంచుకుంటారు.ఇదే కాకుండా పిల్లల్లో వయసు పెరుగుతున్నా రకరకాల భయాలు ఉంటాయి.వాటిని గమనించి అటువంటి భయాలను తొలగించడానికి ప్రయత్నించాలి.
అలాగే చిన్న పిల్లల ముందర గొడవలు పడడం కానీ, గట్టిగా మాట్లాడడం కానీ చెయ్యకూడదు.ఎందుకంటే పెద్ద శబ్దం తో మాట్లాడితే వాళ్ళు భయపడి దగ్గరికి రాకుండా ఉంటారు.
అందుకే వాళ్ళను ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకోవడం వల్ల వారు కొత్తవారిని చూసి భయపడకుండా ఉంటారు.