ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు.ఎన్టీఆర్ ను చంపిన హంతకులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని అన్నారు.
ఎన్టీఆర్ హంతకులకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.వెన్నుపోటు పొడిచి పార్టీని కాజేసిన వ్యక్తికి ఎన్టీఆర్ కుమారులు మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చరిత్రను ఎవరూ చెరిపేయలేరన్న లక్ష్మీపార్వతి.తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
జూనియర్ ఎన్టీఆర్ పై కూడా విష ప్రచారం చేస్తున్నారన్నారు.జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న సంస్కారంలో కొంచెం కూడా లోకేష్ కి లేదని చెప్పారు.
తన కొడుక్కి అడ్డం వస్తాడని జూనియర్ ఎన్టీఆర్ పై తండ్రి కొడుకులు కక్ష కట్టారని ఆరోపించారు.చంద్రబాబు హాయంలో ఒక పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ఆమె ప్రశ్నించారు.14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు.ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.
జిల్లాకు ఎన్టీఆర్ పేరు కావాలా ? యూనివర్సిటీకి పేరు కావాలా ? అంటే జిల్లాకు అయితేనే ఆయన పేరు అందరి మనస్సులో నిలిచిపోతుందని వ్యాఖ్యనించారు.