అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అధికార వైసీపీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయని తెలుస్తోంది.సొంత పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు కనిపిస్తోంది.
ఎస్.రాయవరం ఎంపీపీ శారదాకుమారి రాజీనామా చేశారు.ఎమ్మెల్యే గొల్ల బాబురావు పని తీరు నచ్చకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.పదవిలో లేకపోయినా వైసీపీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు.