రెండున్నర దశాబ్దాల తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది.గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరోసారి అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబయేతర వ్యక్తికి దక్కనుంది.
అశోక్ గెహ్లాట్, శశిథరూర్ వంటి నేతలు అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్నారు.దీంతో గాంధీ కుటుంబం నుండి ఎవరూ అధ్యక్ష ఎన్నికలు నిలబడడం లేదు.
దీంతో కాంగ్రెస్‌పై ఉన్న ఫ్యామిలీ ట్యాగ్‌ని తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.దీంతో పాటు సామాజిక సమీకరణాలను కూడా పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంది.
కుటుంబ పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల ద్యారా అ మచ్చ తొలిగిపోయే అవకాశం ఉంది.అయితే కుటుంబానికి ఓ అపవాద కూడా ఉంది.
గాంధీయేతరుడు ఎవరూ కీలక పదవిలో ఉన్న కానీ వారు గాంధీ డైరక్షన్‌లో నడుస్తారనే అభిప్రాయం ఉంది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి అపవాదనే కాంగ్రెస్ మూటకట్టుకుంది.
కొత్త అధ్యక్షుడు గాంధీ కుటుంబయేతరుడు అయినప్పుడు వందలాది మంది నాయకుల విశ్వాసం గాంధీ కుటుంబంపై ఉంటుంది.కొత్త నాయకుడిని అంగీకరించడం వారికి కష్టంగా ఉంటుంది.
అటువంటి పరిస్థితిలో అధ్యక్షుడుని కాకుండా వారు గాంధీ కుటుంబాన్ని మాత్రమే అనుసరించవచ్చు.ఈ కారణంగా రెండు పార్టీలో రెండు పవర్ సెంటర్‌లు ఏర్పడుతాయి.విభేదాలకు కూడా అస్కారం ఉంటుంది.2014 నుంచి కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఎన్నికల పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఇది కొత్త తల నొప్పులను తెచ్చి పెడుతుంది.

కొత్తగా వచ్చే అధ్యక్షుడి ముందు కీలక సవాళ్ళు ఉన్నాయి.వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.కాబట్టి ఈసారి ఎన్నికలు కొత్త అధ్యక్షుడికి పెద్ద సవాలే.2024 సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే వారు పదవిలో కొనసాగుతారనే గ్యారెంటీ లేదు.







