ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన వీఎస్ రూపాలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.టిక్ టాక్ చేసిన వాళ్లకు కూడా మూవీ ఆఫర్లు ఇస్తున్నారని ఆమె తెలిపారు.
టాలెంట్ ఉంటే మాత్రం ఎవరూ ఎవరినీ ఆపలేరని వీఎస్ రూపాలక్ష్మి చెప్పుకొచ్చారు.సింగిల్ పేరెంట్ గానే కష్టపడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేశానని ఆమె తెలిపారు.
చిన్నపాప ఇప్పుడు చదువుకుంటోందని ఆమె అన్నారు.
నాకు ఒకటే అనిపిస్తుందని వీఎస్ రూపాలక్ష్మి అన్నారు.
మా ఫాదర్ మదర్ కు పుట్టడం నేను చేసిన తప్పు కాదని ఆమె తెలిపారు.నన్ను నా పేరెంట్స్ ఎందుకు ఇచ్చేశారు అనేది నేను క్వశ్చన్ చేయలేదని ఆమె అన్నారు.
చాలా ప్రేమగా పెంచిన ఫాదర్ కూడా దూరం పెట్టాడని నాకు తెలిసి నేనే ఆయనను బాధ పెట్టాడని ఆమె తెలిపారు.ఒక చైల్డ్ కు బర్త్ ఇస్తున్నామంటే ఆ చైల్డ్ గురించి నూటికి నూరు శాతం బాధ్యతలు తీసుకోవాలని వీఎస్ రూపాలక్ష్మి అన్నారు.
నేను చిన్న వయస్సులోనే తల్లినయ్యానని ఆమె తెలిపారు.ఎందుకు నా చిన్నతనంలో ఇంత పనిష్మెంట్ అని అనిపించిందని తల్లీదండ్రులు వదిలేసిన విషయంలో అనిపించిందని వీఎస్ రూపాలక్ష్మి అన్నారు.
వాళ్ల ప్రేమ దక్కకుండా లైఫ్ స్టార్ట్ కావడంతో నా వల్ల ఎవరికీ పెయిన్ రాకూడదని అని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు.చిన్నతనంలో స్టార్ట్ అయిన స్ట్రగుల్ నన్ను చాలా బాధపెట్టిందని ఆమె కామెంట్లు చేశారు.
నన్ను పెంచిన తండ్రికి ఆస్తులు ఉన్నా వాళ్ల పిల్లలు నన్ను దూరం పెట్టారని ఆమె చెప్పుకొచ్చారు.నాకు చిన్నప్పుడు డబ్బు విలువ, ఆస్తుల విలువ తెలియదని వీఎస్ రూపాలక్ష్మి అన్నారు.
నేను మాత్రం నా పిల్లలకు ఏం చేయాలని ఆలోచించానని వీఎస్ రూపాలక్ష్మి వెల్లడించారు.నాకు వర్క్ అంటే నన్ను నేను మరిచేంత ఇష్టమని ఆమె తెలిపారు.