గ్యాస్, ఎసిడిటీ.సర్వసాధారణంగా మదన పెట్టే జీర్ణ సంబంధిత సమస్యలు ఇవి.అయితే ఇవి కొందరిని మరింత తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి.ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జీవన శైలిలో మార్పులు, వేళకు ఆహారం తీసుకోకపోవడం, కంటి నిండా నిద్ర లేకపోవడం వంటి రకరకాల అంశాలు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
దాంతో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వాటి దెబ్బకు ఏమన్నా తినాలంటేనే జంకుతుంటారు.మిమ్మల్ని కూడా గ్యాస్, ఎసిడిటీ తరచూ వేధిస్తున్నాయా.? వాటిని నివారించుకునేందుకు మందులు వాడి వాడి విసిగిపోయారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకుంటే, ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మీ డైట్‌లో ఉంటే.
ఆయా జీర్ణ సమస్యలు దరి దాపుల్లోకి కూడా రావు.మరి ఇంకెందుకు లేటు ఈ జ్యూస్ ఏంటో.
ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.చూసేయండి.
ముందుగా ఒక చిన్న సైజ్ బూడిద గుమ్మడి కాయను తీసుకుని పైతొక్క, లోపల ఉండే గింజలను తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి కాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్‌లో చిటికెడు పింక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం, వన్ టేబుల్ స్పూన్ పుదీనా రసం, చిటికెడు మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తాగేయడమే.రోజుకు ఒకసారి ఈ జ్యూస్‌ను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.దాంతో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టుకుండా ఉంటాయి.
అదే సమయంలో మలబద్ధకం సమస్య ఉన్నా దూరం అవుతుంది.