టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.అయితే మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ ను అందుకొని చాలా కాలం అయ్యింది.
ఈ మధ్యకాలంలో మహేష్ బాబు నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే నిలుస్తున్నాయి.దీంతో తన తదుపరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవాలని భావిస్తున్నాడు మహేష్ బాబు.
నువ్వు తగ్గట్టుగానే కథలను కూడా ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాడు.మహేష్ బాబు తన నమ్మకాలు అన్నీ కూడా ప్రస్తుతం త్రివిక్రమ్ పై పెట్టాడు.
ఇందుకోసం మహేష్ బాబు ఆ కథ విషయంలో ఎప్పుడు లేని విధంగా డౌట్స్ ని కూడా తీసుకువచ్చాడు.ఇక త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు డౌట్స్ మేరకు స్కిప్ట్ ను సిద్ధం చేయడానికి చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది.
అయితే ఫైనల్ గా ఓకే అనిపించేంతవరకు కూడా మహేష్ బాబు షూటింగ్ని మొదలుపెట్టడం లేదు అంటే తన తదుపరి సినిమా విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.సినిమా తర్వాత రాజమౌళితో తీసే సినిమా సక్సెస్ తప్పకుండా వస్తుంది అని మహేష్ బాబు తో పాటు అభిమానులకు కూడా నమ్మకం ఉంది.
మరి అది ఏ రేంజ్ లో సక్సెస్ ను అందిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.రాజమౌళి సినిమా అంటే దాదాపు ఒకటి లేదా రెండేళ్లు వరకు కూడా సమయం పట్టవచ్చు.ఇక ఇంత కాలమైనా కూడా మహేష్ బాబు కాస్త ఎక్కువగానే హార్డ్ వర్క్ చేసి సరైన హిట్ ను అందుకోవాలి అని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక మరొకవైపు రాజమౌళి కూడా స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు కాబట్టి వీలైనంత త్వరగా వదిలించుకోవాలి అన్న ఆలోచనలో మహేష్ ఉన్నాడట.
అందుకే మహేష్ బాబు కఠినంగా ఉన్న కీలకమైన షెడ్యూల్స్ అన్నింటినీ ముందే ఫినిష్ చేసుకోవాలి అనే త్రివిక్రమ్ కు చెప్పాడట.మహేష్ బాబు చెప్పిన విధంగానే త్రివిక్రమ్ కూడా అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.
ఇక ఏడాది చివరిలోపు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేయాలని మహేష్ బాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.