జిమ్ లో సూపర్ స్పీడ్ తో పరిగెత్తుతున్న మహేష్.. వీడియో వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో మహేష్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 Mahesh Babu Workout Video In The Gym, Mahesh Babu, Workout Video, Gym, Pooja Heg-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లినా రెగ్యులర్ షూట్ జరగడం లేదు.

అయితే మహేష్ మాత్రం నెక్స్ట్ సినిమా కోసం తనని తాను ఫుల్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాడు.

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేయనున్నాడు.ఈ సినిమా షూటింగ్ రెగ్యురల్ గా జరగ కుండానే అప్పుడే రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్ కు సంతోష కరమైన న్యూస్ అయితే అందించాడు.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.ఇక మహేష్ ఈ సినిమా కోసం కొత్త లుక్ లోకి మారిపోయాడు.

తాజాగా ఈయన నుండి మరొక అప్డేట్ వచ్చింది.తాజాగా మహేష్ బాబు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.

కొత్త లుక్ లోకి ఇప్పటికే మారిపోయిన మహేష్ ఇప్పుడు ఫిట్ నెస్ మీద ద్రుష్టి పెట్టాడు.ఈయన తాజాగా జిమ్ లో త్రెడ్ మిల్ పై సూపర్ స్పీడ్ తో పరిగెడుతున్న వీడియోను షేర్ చేసాడు.ఈ స్పీడ్ చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు.ఈ వీడియో అంతే స్పీడ్ తో షేర్ అవుతుంది.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube