సెప్టెంబర్ మొదటి తారీకున సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు..!!

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ మొదటి తారీకున సీఎం జగన్ ఇంటి ముట్టడించడానికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.సిపిఎస్ రద్దు చేయకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేపడుతున్నారు.

 The Trade Unions Have Called For The Siege Of Cm Jagan's House On The First Of S-TeluguStop.com

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమం పోస్టర్ లను జిల్లాల వారీగా విడుదల చేస్తూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇదే సమయంలో సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజయవాడలో మిలియన్ మార్చ్ నిర్వహించడానికి రెడీ కావడం జరిగింది.

ఏపీ ఎన్జీవోల సంఘం ఏలూరు జిల్లా జేఏసీ చైర్మన్ ఆర్ఎస్ హరినాథ్ సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం పోస్టర్లను ఏపీసిపిఎస్ ఉద్యోగ సంఘం జిల్లా నాయకులతో కలిసి ఇటీవల ఆయన ఆవిష్కరించడం జరిగింది. వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగుల సిపిఎస్ రద్దు చేస్తామని గతంలో ప్రకటించడం జరిగింది.

ఈ క్రమంలో మూడు సంవత్సరాలైనా గాని సిపిఎస్ రద్దు చేయకపోవడంతో.ఇచ్చిన హామీని నెరవేర్చాలని వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల గత కొంతకాలంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలో సెప్టెంబర్ మొదటి తారీకున సీఎం జగన్ ఇంటి ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వటం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube