చాలా మంది రైలు ప్రయాణం అంటే బాగా ఇష్టపడతారు.కిటికీలో నుంచి బయటకు చూస్తూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంటారు.
భద్రత, టికెట్ ధరల దృష్ట్యా ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు.ఇక రైల్వే స్టేషన్‌కు వచ్చిన వారంతా కనిపించే స్టాళ్లలో ఏదో ఒకటి కొనకుండా ఉండరు.
ఈ క్రమంలో సామాన్యులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో స్టాళ్లను ఏర్పాటు చేసుకునేందుకు టెండర్లను ఆహ్వానిస్తోంది.
చిన్న స్టాళ్ల ద్వారా లక్షల్లో ఆర్జించే సదుపాయాన్ని కల్పిస్తోంది.దీనికి సంబంధించిన వివరాలను ఐఆర్‌సీటీసీ ఇప్పటికే వెల్లడించింది.
ఈ టెండర్లకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
భారతదేశంలోని రైల్వే స్టేషన్‌లో ఓపెన్ స్టాల్ కావాలనుకునే వ్యక్తి నిర్దిష్ట లైసెన్స్ లేదా ఐఆర్‌సీటీసీ నుండి అనుమతి పొందాలి.
రైల్వే స్టేషన్లలోని క్యాంటీన్ పెట్టుకోవాలంటే ఐఆర్‌సీటీసీ డివిజన్ యొక్క డీఆర్ఎం(కమర్షియల్)కు దరఖాస్తు చేసుకోవాలి.ఇదే కోవలో స్టాల్స్ పెట్టుకోవాలన్నా టెండర్లలో పాల్గొనాల్సి ఉంటుంది.అందుకు సంబంధించి www.indianrailways.gov వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలున్నాయి.ఓపెన్ టెండర్ల ద్వారా స్టాల్స్‌ను కేటాయిస్తారు.
సాధారణంగా స్టాల్స్‌ను నడపడానికి 5 సంవత్సరాల కాలానికి లైసెన్స్ ఇవ్వబడుతుంది.రైల్వే స్టేషన్లలో వ్యాపారులు తీసుకునే స్థలం ఆధారంగా స్టాళ్లకు ఫీజు ఉంటుంది.రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెడితే చక్కటి లాభాలను ఆర్జించవచ్చు.ఈ స్టాళ్లకు విపరీతమైన పోటీ ఉంటుంది.ఐఆర్‌సీటీసీ అధికారులకు టెండర్లు వెల్లువలా వచ్చి పడతాయి.కాబట్టి వీలైనన్ని టెండరు దరఖాస్తులను తగ్గించడానికి చూడొచ్చు.కాబట్టి టెండరు దరఖాస్తులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి.