మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థలు చాలానే ఉన్న వాటిలో వైజయంతీ మూవీస్ కు ప్రత్యేక గుర్తింపు ఉండేది.ఎప్పటి నుండో వీరు సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు.
కానీ ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఆ మధ్య కొంత కాలం స్లో అయ్యింది.మళ్ళీ ఈ నిర్మాణ సంస్థ కోలుకోవడం కష్టమే అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ మరోసారి పుంజుకున్నట్టు అనిపిస్తుంది.వరుస హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటూ మళ్ళీ గాడిలో పడినట్టే అనిపిస్తుంది.వైజయంతీ మూవీస్ అధిపతి అశ్వినీదత్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పూర్వవైభవం దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది.ఈ నిర్మాణ సంస్థలో వచ్చే సినిమాలు ఎటువంటి హడావిడి లేకుండా వచ్చి సూపర్ హిట్లు సాధిస్తున్నాయి.
మహానటి.జాతిరత్నాలు. ఇప్పుడు వచ్చిన సీతా రామం. కూడా ఇలానే సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నాయి.
వైజయంతీ మూవీస్ లో నాగ్ అశ్విన్ కాలు మోపినప్పటి నుండి ఈ నిర్మాణ సంస్థ వరుస హిట్స్ అందుకుంటుంది.నాగ్ అశ్విన్ ప్రతిభ కలిగిన వారికే అవకాశాలు ఇస్తూ మంచి మంచి సినిమాలను ఎంచుకుంటూ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు.
బ్లాక్ బస్టర్ ఉంటేనే అవకాశం ఇస్తాము అని కాకుండా ప్రెజెంట్ సినిమా స్క్రిప్ట్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వైజయంతీ మూవీస్ కి పూర్వవైభవం వచ్చేలా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.కథను నమ్మితే చాలు కాసులే కాసులు కురిపిస్తాయి అని నమ్మి సినిమాలు తీస్తున్నారు.
ఈ కోవకే జాతిరత్నాలు, సీతా రామం చెందాయి.జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ ఈ ఇచ్చి తనని తాను నిరూపించుకునేలా అవకాశం ఇచ్చారు.ఆ తర్వాత హను రాఘవపూడి కష్టకాలంలో ఉండగా సీతా రామం సినిమాకు అవకాశం ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నారు.ఈ రెండు కూడా కాసుల వర్షం కురిపించాయి.