ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.నిత్యం ఎంతోమంది ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు.
అమాయకంగా ఉండే ప్రజలని గుర్తించి వారిని ట్రాప్ లోకి దింపి మోసాలకు పాల్పడుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు.ఇప్పటికే ఎంతోమంది అమాయకులు ఆ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన విషయం తెలిసిందే.
అయితే ఈ సైబర్ నేరగాల ఉచ్చులో కేవలం సాధారణ ప్రజలే మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం చిక్కుకుంటున్నారు.అయితే ఎంతోమంది వారి పరువు నష్టాలు పోతాయి అని బయటికి చెప్పలేక పోతుండగా ఇంకొందరు మాత్రం ధైర్యం చేసి ముందుకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు.
అయితే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన డబ్బును తిరిగి తెచ్చుకోవడం అంటే పెద్ద సాహసమే అని చెప్పవచ్చు.
తాజాగా ఒక బుల్లితెర నటి కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో ఓడిపోయి వెంటనే ముంబైలోనే ఓషివారా పోలీస్ లను ఆశ్రయించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.బుల్లితెరపై ప్రసారమయ్యే పరిస్థితి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అమన్ సందు.
ప్రస్తుతం అమన్ సందు గోరేగామ్ లో నివసిస్తోంది.తాజాగా ఈమె సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో చిక్కుకుంది.
తన తల్లికి డాక్టర్ అపాయింట్మెంట్ కోసం అని జుహు కి చెందిన ఆసుపత్రి వెబ్సైట్ కోసం జూలై 6న నెట్ లో.సెర్చ్ చేయగా అప్పుడు అధికారిక వెబ్సైట్ మాదిరి కనిపించే ఒక నకిలీ వెబ్ సైట్ లో ఆమె నెంబర్ ను నమోదు చేసింది.ఆ తర్వాత ఆమె నెంబర్ కు కాల్ చేసిన ఒక వ్యక్తి అపాయింట్మెంట్ కోసం బుక్ చేసుకోవాలని అందుకోసం ఒక వాట్సాప్ లింక్ పంపించి దానిపై క్లిక్ చేయమని అతను చెప్పాడట.
సదరునటి ఆ లింకు పై క్లిక్ చేయగానే వెంటనే ఆమె ఖాతాలో నుంచి దాదాపుగా 2.24 లక్షల డెబిట్ అయ్యాయట.దీంతో తాను మోసపోయాను అని గ్రహించిన సదరు నటి పోలీసులను ఆశ్రయించింది.
వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తును చేసి ఎంతో జాగ్రత్తగా ఆ డబ్బును మళ్ళీ రికవరీ చేశారు.అయితే ఆ నటి డబ్బులను కాజేసిన అకౌంట్ ని బ్లాక్ చేసామని పోలీసులు తెలిపారు.
ఇదే విషయాన్ని నటి అమన్ సందు చూసిన మీడియా వేదికగా తెలిపింది.తన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ నా అనుభవంతో చెబుతున్న పోలీసులను మనం విశ్వసించాలి.కానీ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా కొంత ఓపికతో సంయమనం పాటించాలి.
ఇలాంటి పరిస్థితిలో పోలీసులు మాత్రమే సహాయం చేయగలరు అని ఇన్‌స్టా వేదికగా పేర్కొంది నటి అమన్ సంధు.