ఖమ్మం నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్ లో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందుతుడు చెని గోపి (27 yrs}ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం వన్ టౌన్ సిఐ చిట్టిబాబు వివరాలు వెల్లడించారు.మంచికంటి నగర్, బొక్కల గడ్డ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అయిన చెని గోపి అనే వ్యక్తి తన వ్యక్తిగత కుటుంబ సమస్యల నేపథ్యంలో తన కుటుంబ ఏవరు పట్టించుకోవడం లేదని, నగరంలో అలజడి సృష్టించి, వివిధ వర్గాల మధ్య విధ్వేసాలు రెచ్చగొట్టి ప్రజల దృష్టి తనవైపు మరలిచి తన సమస్యలను పరిష్కారించుకునేందకుఉద్దేశపూర్వకంగా సిద్ధమై అంబేడ్కర్ విగ్రహం ధ్వంసానికి యత్నించినట్లు తెలిపారు.
స్దానికంగా వున్న బ్లూ కోల్డ్స్ పోలీస్ సిబ్బంది వేంటానే స్పందించి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించగా కేసు నమోదు చేసి న్యాయస్దానం కు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించటంతో జైలు తరలించినట్లు ఆయన తెలిపారు.ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని, వారి మీద కేసు నమోదు చేయడంతో పాటు తీవ్రంగా పరిగణిస్తామని వన్ టౌన్ సిఐ తెలిపారు.