కేరళ సరికొత్త ప్రయోగం: సొంత ఇంటర్నెట్ ప్రారంభం.. గూగుల్ కి చెక్ పెట్టబోతున్నారా?

కేరళ సరికొత్త ప్రయోగంతో ముందుకు రాబోతోంది.మన ఇండియాలో వున్న ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలనే నేపథ్యంలో దీనికి శ్రీకారం చుట్టింది కేరళ ప్రభుత్వం.

 Kerala S New Experiment Start Of Own Internet , Kerala , New Project , Google ,-TeluguStop.com

దాంతో ఇండియాలోనే సొంత ఇంటర్నెట్ సేవలను కలిగిన ఏకైక రాష్ట్రంగా కేరళ గుర్తింపు సాధించింది.అక్షరాస్యత, పరిపూర్ణమైన పంచాయితీ రాజ్ వ్యవస్థ, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో ఎన్నో ఘనతలు సాధించిన కేరళ.

ప్రస్తుతం మరో విజయంతో ఒకడుగు ముందుకు వేసింది.ఈ ఘనతను కేరళ CM పినరయి విజయన్ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ఉండే డిజిటల్ సమస్యలను తొలగించేందుకు ఈ పథకం సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.‘దేశంలో సొంత ఇంటర్నెట్ సేవలను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రంగా కేరళ అవతరించిందని.కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ లిమిటెడ్‌కు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యునికేషన్ నుంచి ఐఎస్పీ లైసెన్స్ వచ్చిందని తెలిపారు.దాంతోపాటు KFON ప్రాజెక్ట్ ప్రజలకు ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా అందించేలా కార్యకలాపాలు ప్రారంభిస్తుందన్నారు.

ఇక ఈ ఇంటర్నెట్‌ సేవలు భవిష్యత్తులో దేశవ్యాప్తం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈ విషయంపైన నెటిజన్లు మిక్కిలి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా కేరళ CM పినరయి విజయన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఎక్కువమంది పాజిటివ్ దృక్ఫథంతో కామెంట్లు చేయడం విశేషం.‘కేరళ దేశానికే తలమానికం’ కొందరంటే, ‘విజయన్ సార్! మీరు సూపర్ సార్’ అని కొందరు, ‘గూగుల్ కి తొందరలో చెక్ పెట్టేద్దాం.మనదేశానికి సంబంధించింది ఉండగా.వేరేది ఎందుకు?’ అని మరికొందరు… ఇలా తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube